అప్పుడు కమల్ హాసన్.. ఇప్పుడు రజినీకాంత్

Nivetha Thomas turns Rajinikanth Daughter,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nivetha Thomas To Act in Super Star Rajinikanth New Movie,Nivetha Thomas Next in Rajinikanth Movie,Nivetha Thomas Role in Rajinikanth Next Film,Nivetha Thomas To Play Rajinikanth Daughter in Murugadoss Movie
Nivetha Thomas turns Rajinikanth Daughter

‘ జెంటిల్ మన్’, ‘నిన్ను కోరి’, ‘జై లవకుశ’, ‘118’ వంటి విజయవంతమైన చిత్రాలలో నటించి సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది నివేదా థామస్. ప్రస్తుతం ఈ కేరళ కుట్టి ‘శ్వాస’, ‘బ్రోచేవారెవరురా’ వంటి తెలుగు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే.. ఈ టాలెంటెడ్ బ్యూటీకి ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో నటించే ఛాన్స్ దక్కిందని కోలీవుడ్ వర్గాల సమాచారం.

ఆ వివరాల్లోకి వెళితే… సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా బ్రిలియంట్ డైరెక్టర్ ఏ ఆర్ మురుగదాస్ ఓ భారీ బడ్జెట్ మూవీని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రజినీకాంత్ జోడిగా నయనతార నటించనుండగా… ఓ కీలక పాత్రలో నివేద థామస్ నటించనుందని సమాచారం. వినిపిస్తున్న కథనాల ప్రకారం… రజినీ కూతురు గా నివేద పాత్ర ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు.. ఈ పాత్ర చుట్టే కథ తిరుగుతుందని కోలీవుడ్ టాక్.

కాగా… ఇదివరకు నివేద లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన ‘పాపనాశం’ (‘ దృశ్యం’ కి రీమేక్) లో అతని కూతురు గా నటించింది. మళ్లీ ఇప్పుడు రజినీకాంత్ కూతురుగా నటించే అవకాశం దక్కించుకోవడం విశేషం. త్వరలోనే నివేదా ఎంట్రీ పై క్లారిటీ వస్తుంది.

[subscribe]

[youtube_video videoid=h2K6y-aVFD8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.