ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న కథానాయికల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. తెలుగులో కాజల్ నటించిన తాజా చిత్రం ‘సీత’ విడుదలకు సిద్ధంగా ఉండగా… తమిళంలో ‘క్వీన్’ రీమేక్ అయిన ‘పారిస్ పారిస్’ రిలీజ్ కి రెడీ అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అలాగే… లోకనాయకుడు కమల్ హాసన్ కి జోడీగా నటిస్తున్న ‘ఇండియన్ 2’ చిత్రీకరణ దశలో ఉంది. మరోవైపు శర్వానంద్ కి జోడీగా నటిస్తున్న పేరు నిర్ణయించని చిత్రం కూడా చిత్రీకరణ తుది దశలో ఉంది.
అంతేకాదు… తమిళ చిత్ర కథానాయకుడు జయం రవి కి జంటగా కాజల్ నటిస్తున్న ‘కోమలి’ సినిమాకి సంబంధించి తన పాత్ర తాలూకు చిత్రీకరణను కూడా తాజాగా పూర్తి చేసింది కాజల్. ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహిస్తున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ ఈ ఏడాది ద్వితీయార్థంలో తెరపైకి రానుంది. మొత్తం మీద… ఈ సంవత్సరం కాజల్ వరుస సినిమాలతో సందడి చేయబోతోంది.
[youtube_video videoid=cXlGET2oQh0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: