శశి మూవీ రివ్యూ

Sashi Telugu Movie Review,Sashi Movie Review,Latest Telugu Movie Reviews,Latest Telugu Movies News,Latest Tollywood News,Telugu Film News 2021,Telugu Filmnagar,Tollywood Movie Updates,Sashi,Sashi Movie,Sashi Movie Public Response,Sashi Movie Public Talk,Sashi Movie Review,Sashi Movie Review And Rating,Sashi Movie Updates,Sashi Public Talk,Sashi Public Talk And Public Response,Sashi Review,Sashi Review And Rating,Sashi Telugu Movie,Sashi Telugu Movie Latest News,Sashi Telugu Movie Public Response,Sashi Telugu Movie Public Talk,Sashi Telugu Movie Review And Rating,Aadi Saikumar,Aadi,Surbhi Puranik,Srinivas Naidu Nadikatla,Arun Chiluveru,Aadi Sashi Telugu Movie Review,Aadi Sashi Movie Review,Aadi Sashi Review,Aadi Sashi Movie Review And Rating,Aadi Sashi Movie Story,Aadi Sashi Movie Live Updates

శ్రీనివాస్ నాయుడు నడికట్ల డైరెక్షన్లో ఆది హీరోగా వచ్చిన సినిమా ‘శశి’. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ,ట్రైలర్ ల వల్ల ఈ సినిమాపై అంచనాలు కూడా బాగానే పెరిగాయి. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సురభి, రాశీ సింగ్‌ హీరోయిన్లు గా నటిస్తుండగా రాజీవ్ కనకాల, జయప్రకాష్, అజయ్, వెన్నెల కిషోర్, రాశి సింగ్, తులసి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు అరుణ్‌ చిలువేరు సంగీతం అందించాడు. ఇక భారీ అంచనాల మధ్య ఈరోజు ఈసినిమా రిలీజ్ అయింది. మరిఎప్పటినుండో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆదికి ఈసినిమా హిట్ అందించిందా లేదా అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మూవీ నేమ్ : శశి (తెలుగు)
బ్యానర్ : శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్
స్టోరీ అండ్ డైరెక్షన్ : శ్రీనివాస్ నాయుడు నడికట్ల
డి ఓ పి : అమర్నాధ్ బొమ్మిరెడ్డి
స్క్రీన్ ప్లే : మని కుమార్ చినిమిల్లి
డైలాగ్స్ : ఐ . రవి
మ్యూజిక్ : అరుణ్ చిలువేరు
ఆర్ట్ : రఘు కులకర్ణి
ఎడిటర్ : సత్య . జి
ఫైట్స్ : రియల్ సతీష్
కోరియోగ్రఫీ : విశ్వ రఘు
పి:ఆర్ :ఓ : వంశీ అండ్ శేఖర్

కథ..

ఆది సాయి కుమార్ (రాజు) ఎలాంటి బాధ్యతలు లేకుండా లైఫ్ ను లీడ్ చేస్తుంటాడు. తన కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా వినకుండా తన ఇష్టం వచ్చినట్టు ఉంటాడు. అలాంటి రాజు ఒకరోజు శశి(సురభి) చూస్తాడు. శశిని చూసిన రాజుకు ఆమెతో గతంలో పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంతకీ సురభి వెనుకే రాజ్ ఎందుకు తిరుగుతున్నాడు ? వాళ్ళ మధ్య గతంలో ఉన్న సంబంధం ఏమిటి ? అసలు శశికి ఉన్న సమస్య ఏమిటి ? అన్నిటికంటే ముఖ్యంగా రాజ్ ఎందుకు బాధ్యత లేకుండా తయారయ్యాడు ? అనేది కథ

విశ్లేషణ

తెలుగు తెరపై ఎన్నో ప్రేమకథలు చూశాం.. ఎంతో మంది భగ్న ప్రేమికులను చూశాం. ఇకఈసినిమా కూడా కాస్త అలాంటి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిందే. అయితే ఈపాత్ర ఆది కొత్త అని చెప్పాలి. డైరెక్టర్ చాలా సింపుల్ పాయింట్ నే తీసుకున్నాడు. ఇక పెద్ద హడావుడి లేకుండా అంతే సింపుల్ గా తెరపైన చూపించాడు.

ఇక ఈసినిమాలో ఆది రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించి బాగానే ఆకట్టుకున్నాడు. కాలేజ్ కుర్రాడి పాత్రలో సాఫ్ట్ గా లవ్ బాయ్ లాగా.. మరోవైపు రఫ్ అండ్ రగ్డ్ లుక్ లో కనిపించాడు. లవర్ బాయ్ పాత్ర ఆది ఇంతకు ముందే చేసినా పెయిన్ ఫుల్ పాత్రలో నటించడం మాత్రం ఇది మొదటిసారే. ఒకరకంగా ఈ లుక్ ఆదికి బాగానే సెట్ అయింది. అంతేకాదు సూపర్బ్ గా పెర్ఫార్మన్స్ కూడా చేసాడు.

ఇక హీరోయిన్ సురభి కూడా రెండు డిఫరెంట్ షేడ్స్ లో బాగా నటించింది. ముఖ్యంగా కొన్ని ప్రేమ సన్నివేశాల్లో అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ లోనూ సురభి నటన చాల బాగుంది. రాశి సింగ్ కనిపించేది కాసేపే అయినా ఉన్నంతలో ఓకే అనిపిస్తుంది. తులసి ఆది మదర్ పాత్రలో బాగా చేయడమే కాకుండా ఎమోషనల్ సీన్స్ లో మెప్పించిందని. అజయ్, జయరాం, రాజీవ్ కనకాల, శివ తదితరులు పాత్రల పరిధిమేర నటించారు.

ఈసినిమా నుండి విడుదలైన సాంగ్స్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక సాంగ్స్ విజువల్ గా కూడా బాగున్నాయి అలాంగే అరుణ్ చిలువేరు అందించిన నేపధ్య సంగీతం బాగుంది. అమర్నాథ్ సినిమాటోగ్రఫీ బాగుంది.

ఓవరాల్ గా చెప్పాలంటే ప్రేమ కథలన ఇష్టపడే వారికి ఈసినిమా నచ్చుతుంది.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here