లెనిన్ లో భారతి పాత్రకు ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ, ఆదరణ జీవితాంతం మర్చిపోలేను -భాగ్యశ్రీ బోర్సే
లెనిన్' విజయం నాకు గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. 'భారతి' పాత్ర జీవితాంతం గుర్తుండిపోతుంది' అని హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే అన్నారు. అఖిల్ అక్కినేని హీరోగా, భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించిన 'లెనిన్' చిత్రాన్ని అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించగా, మురళీకిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుని బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో భాగ్యశ్రీ బోర్సే సినిమా విజయంతో పాటు తన పాత్రకు లభిస్తున్న స్పందన, సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
పూర్తి వార్త చదవండి


















