వైవిధ్యమైన పాత్రలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ రూరల్ ఎమోషనల్ డ్రామా ‘ఇడుపు కాయితం’. అచ్చమైన తెలంగాణ వ్యవహారిక పదాన్ని టైటిల్‌గా ఎంచుకున్న ఈ చిత్రం అనౌన్స్మెంట్ నుంచే భారీ హైప్‌ను క్రియేట్ చేసింది.ఎప్పుడెప్పుడు విడుదలవుతుందాని ప్రేక్షుకులు ఎదురుచుస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వర్క్‌షాప్ సెషన్స్ విజయవంతంగా పూర్తి కావడంతో, తాజాగా ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అక్టోబర్ నాటికి షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకుని, ఈ ఏడాది డిసెంబర్ మొదటి వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ పక్కా ప్లాన్‌తో ఉన్నారు. స్టార్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ మరియు తబిత సుకుమార్ (సుకుమార్ రైటింగ్స్) సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వంశీరెడ్డి దొండపాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, తెలంగాణ జానపద పాటల ద్వారా విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్న ఫోక్ డాన్సర్ నాగదుర్గ ఈ సినిమాతో హీరోయిన్గా పరిచయమవుతోంది.
గ్రామీణ తెలంగాణ సంస్కృతి, కుటుంబ బంధాల నేపథ్యంలో ఎంతో హార్ట్‌టచింగ్‌గా సాగే ఒక విభిన్నమైన కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘ఇడుపు కాయితం’ అంటే తెలంగాణ మాండలికంలో భార్యాభర్తలు విడిపోయేటప్పుడు రాసుకునే ఒప్పంద పత్రం (విడాకుల కాగితం) అని అర్థం. ఎంతో అందంగా సాగిపోయే ఒక పెళ్లి జంట మధ్య ఎలాంటి పరిస్థితులు వచ్చాయి అనే ఆసక్తికరమైన ఎమోషనల్ ఫ్యామిలీ లైన్‌తో ఈ సినిమా ఉండబోతోంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























