స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రం ‘మా ఇంటి బంగారం’ ఓటీటీ విడుదలకు అధికారికంగా ముహూర్తం ఖరారైంది. థియేటర్లలో భారీ వసూళ్లతో ప్రభంజనం సృష్టించిన ఈ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, కేవలం నాలుగు వారాల్లోనే డిజిటల్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ఈ క్రేజీ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘జియో హాట్‌స్టార్’ వేదికగా రాబోయే జూలై 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ విషయాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌తో పాటు సమంత హోమ్ బ్యానర్ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ సంయుక్తంగా అధికారికంగా ప్రకటించాయి. ప్రస్తుతం కేవలం తెలుగు వర్షన్‌కు సంబంధించిన విడుదలను మాత్రమే ఖరారు చేయగా, మిగతా భాషల వివరాలను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.
నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, జూన్ 19న థియేటర్లలో విడుదలై వరల్డ్‌వైడ్‌గా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన హీరోయిన్-ఓరియెంటెడ్ చిత్రంగా నిలిచిన ‘మా ఇంటి బంగారం’ ఓటీటీలో కూడా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























