భారతీయ సినీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ స్థాయిలో విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పౌరాణిక చిత్రం రామాయణ . తరతరాలుగా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తూ, ధర్మం మరియు ధైర్యానికి ప్రతీకగా నిలిచిన రామాయణ మహాకావ్యాన్ని సరికొత్త ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వెండితెరపై ఆవిష్కరించేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ మహోన్నత కావ్యానికి సంబంధించిన మోస్ట్ అవేటెడ్ థియేట్రికల్ ట్రైలర్ విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
భారతదేశ సంస్కృతిని, గొప్పతనాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పేలా రూపొందుతున్న ఈ లార్జర్ ద్యాన్ లైఫ్ విజువల్ ఎపిక్ యొక్క ట్రైలర్‌ను రాబోయే జూలై 24న ప్రపంచవ్యాప్తంగా అత్యంత గ్రాండ్‌గా ప్రీమియర్ చేయబోతున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఈ మేరకు విడుదల చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్ చూస్తుంటే, ఒక భారీ రాజదర్బార్ నేపథ్యంలో విజువల్స్ అత్యంత అద్భుతంగా, గ్రాండ్‌గా ఉండబోతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతూ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసింది.
జూలై 24న విడుదల కానున్న ఈ పవర్ఫుల్ ట్రైలర్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.రన్బీర్ కపూర్ రాముడిగా సాయి పల్లవి సీత గా యష్ రావణాసురిడిగా నటిస్తున్న ఈసినిమాను నితీష్ తివారి తెరకెక్కిస్తుండగా నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. ఈసినిమా రెండు భాగాలుగా రానుండగా మొదటి భాగం ఈ దీపావళికి థియేటర్లలోకి రానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























