సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ‘లెనిన్’ చిత్రంతో వచ్చి బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్నాడు అఖిల్ అక్కినేని. ఇక సక్సెస్ మీట్లో అఖిల్ మాట్లాడుతూ.. తన గత చిత్రాలు ఆశించిన విజయం సాధించకపోయినా, తనను నమ్మి ఈ రూరల్ యాక్షన్ డ్రామా కథతో ముందుకు నడిపిన దర్శకుడు మురళీ కిషోర్‌కు, నిర్మాత నాగవంశీకి థాంక్స్ చెప్పారు.మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉంటాయోనని కంగారు పడ్డ కానీ ఊహించని విధంగా ఓపెనింగ్స్ వచ్చాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గత రెండు మూడు సంవత్సరాలుగా ఈ సినిమా కోసం పడ్డ కష్టానికి, రక్తం మరియు చెమట చిందించి చేసిన ప్రయత్నానికి థియేటర్లలో ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూశాక తన శ్రమంతా మర్చిపోయానని ఎంతో వినయంగా పంచుకున్నారు. తనను సరికొత్త ‘అఖిల్ 2.0’ గా ఆదరిస్తూ, అండగా నిలిచిన అక్కినేని అభిమానులకు మరియు తెలుగు ప్రేక్షకులకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ బ్లాక్‌బస్టర్ హిట్ తనలో బాధ్యతను మరింత పెంచిందని, ఇకపై కూడా ప్రేక్షకులను అలరించేందుకు మరింత కష్టపడతానని అఖిల్ ఎంతో దృఢంగా చెప్పారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























