అక్కినేని అఖిల్ మాస్ మేకోవర్‌తో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ .మొదటి వీకెండ్‌లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 61.1 కోట్లకు పైగా భారీ గ్రాస్ వసూళ్లను రాబట్టి, సాలిడ్ హోల్డ్‌తో దూసుకుపోతున్న ఈ చిత్ర విజయానందాన్ని ప్రేక్షకులతో పంచుకోవడానికి చిత్ర యూనిట్ సరికొత్త ప్లాన్ చేసింది. హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్ మీట్ సక్సెస్ తర్వాత, ఈ సినిమా సాధించిన భారీ విజయానికి కృతజ్ఞతగా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నగరంలో భారీ ఎత్తున గ్రాండ్ సక్సెస్ మీట్‌ను నిర్వహించబోతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాబోయే జులై 15, బుధవారం రోజున గుంటూరు వేదికగా ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ జరగనున్నాయి. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ చిత్రానికి లభిస్తున్న అపూర్వమైన ఆదరణకు, ముఖ్యంగా మాస్ సెంటర్ల నుంచి వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్‌కు థాంక్స్ చెప్పడానికే చిత్ర బృందం గుంటూరును వేదికగా ఎంచుకుంది.జేకేసీ రోడ్ లో వున్న భాష్యం ఒలింపస్ గ్రౌండ్ లో సాయంత్రం 5 గంటలనుండి ఈ సెలబ్రేషన్స్ జరుగనున్నాయి.
ఈ గ్రాండ్ సక్సెస్ మీట్‌లో హీరో అఖిల్ అక్కినేనితో పాటు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు, నిర్మాత సూర్యదేవర నాగవంశీ మరియు చిత్ర సాంకేతిక నిపుణులు అందరూ పాల్గొని సందడి చేయనున్నారు. ‘అయ్యగారే నెంబర్ వన్’ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేసే అఖిల్ వీరాభిమానులు గుంటూరులో భారీ సంఖ్యలో ఉండటంతో, ఈ ఈవెంట్ అక్కినేని ఫ్యాన్స్‌కు ఒక పెద్ద మాస్ పండగలా మారబోతోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























