సిద్ధార్థ్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం
స్వతహాగా కోలీవుడ్ నటుడైనప్పటికీ తెలుగునాట కూడా పాపులర్ అయిన హీరో సిద్ధార్థ్. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అయితే ఎందుకనో గత కొంతకాలంగా సిద్దు తమిళ్ చిత్రాలలోనే ఎక్కువగా నటిస్తున్నాడు. ఇదే కోవలో గతేడాది ఆయన నటించి, స్వయంగా నిర్మించిన 'చిత్తా' సినిమా ఘనవిజయం అందుకుంది. కలెక్షన్ల పరంగానే కాకుండా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. దీనిని తెలుగులో 'చిన్నా' పేరుతో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. మూవీ కాన్సెప్ట్ బాగున్నప్పటికీ ఇది థియేటర్లలో యావరేజ్‌గా నడించింది.
పూర్తి వార్త చదవండి


















