టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ రెడ్డి రౌడీ బాయ్స్ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈసినిమా డీసెంట్ హిట్ నే అందించింది. ఆ తరువాత సెల్ఫిష్ సినిమాను లైన్ లో పెట్టాడు. అయితే ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. కానీ మధ్యలో షూట్ కు బ్రేక్ పడింది. ఈసినిమా కథలో మార్పు చేయడం కోసమే షూటింగ్ ను ఆపినట్టు వార్తలు వచ్చాయి. ఈనేపథ్యంలోనే ఈసినిమా కంటే వెనుక మొదలుపెట్టిన లవ్ మీ మూవీని కంప్లీట్ చేసి రిలీజ్ చేశారు. ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు సెల్ఫిష్ షూట్ ను మళ్లీ మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. కథలో చేసిన మార్పులు నచ్చి షూటింగ్ ను మొదలుపెట్టనున్నట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రానున్న ఈసినిమామాలో లవ్ టుడే ఫేమ్ ఇవానా హీరోయిన్ గా నటిస్తుంది. సుకుమార్ రైటింగ్స్ , ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ ల శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, అశోక్ బండ్రెడ్డి ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా మణికందన్ పని చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




































