కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

అనంత్ అంబానీ పెళ్లిలో సందడి చేసిన మహేష్ బాబు ఫ్యామిలీ

Superstar Mahesh Babu Family Attends Anant Ambani Wedding Ceremony

అనంత్ అంబానీ పెళ్లిలో సందడి చేసిన మహేష్ బాబు ఫ్యామిలీ

Superstar Mahesh Babu Family Attends Anant Ambani Wedding Ceremony

Superstar Mahesh Babu Family Attends Anant Ambani Wedding Ceremony

భారత దిగ్గజ పారిశ్రామికవేత్త, అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన రెండో కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‍ వివాహం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ వేదికగా జరిగిన ఈ వేడుకలో అనంత్ ఇరు కుటుంబాల సాక్షిగా రాధికా మర్చంట్‍ను పరిణయమాడారు.

ఇక ఈ వేడుకలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీతో సహా పాల్గొన్నారు. సతీమణి నమ్రతా శిరోద్కర్, కుమార్తె సితార ఘట్టమనేనితో కలిసి మహేష్ కళ్యాణ వేదిక వద్ద ఫోటోలకు ఫోజులిచ్చారు. బ్లాక్ డ్రెస్‌లో మెరిసిన మహేష్ బాబు స్టైలిష్ లుక్‌తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. కాగా దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా త్వరలో ఓ పాన్ వరల్డ్ మూవీ స్టార్ట్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేష్ బాబును ఫోటోలు తీసేందుకు మీడియా ప్రతినిధులు అమితాసక్తి కనబరిచారు.

కాగా జూలై 12-14 తేదీలలో మూడు రోజులపాటు వీరి కళ్యాణ వేడుకలు ఈ వివాహ వేడుకలు జరుగనున్నాయి. దీనిలో భాగంగా నిన్న ముఖ్య ఘట్టమైన 'శుభ్ వివాహ్' జరుగగా.. శనివారం 'శుభ్ ఆశీర్వాద్', ఆదివారం 'మంగళ్ ఉత్సవ్' నిర్వహించనున్నారు. ఈ వేడుకలలో దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటున్నారు. బాలీవుడ్ నటీ,నటులతోపాటు దక్షిణాది చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్