గోపీచంద్ విశ్వం వాయిస్ ఓవర్ కోసం కల్కి

pan india star prabhas voice over for gopichand viswam movie

గోపీచంద్ కూడా సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గా భీమా సినిమాతో వచ్చాడు. ఈసినిమా కూడా విజయాన్ని అందించలేకపోయింది. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా విశ్వం. ఢీ, రెడీ, దూకుడు లాంటి సినిమాలతోో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శ్రీనువైట్ల తో ఈసినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇప్పటికే గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పోస్టర్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ కు మంచి రెస్పాన్సే వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈసినిమాలో గోపీచంద్ పాత్రకు కొన్ని చోట్ల ఓ వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుందట. అయితే ఆ వాయిస్ ఓవర్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చెప్పబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. దీంతో గోపీచంద్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రభాస్-గోపీచంద్ మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే కదా.

కాగా ఈసినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీనువైట్ల ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు పనిచేసిన గోపీ మోహన్ ఈసినిమాకు స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. చైతన్య భరద్వాజ్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా.. కేవీ గుహన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ పై వేణు దొనెపూడి ఈసినిమాను నిర్మిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.