కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

అనంత్ అంబానీ పెళ్లిలో సందడి చేసిన రామ్ చరణ్, ఉపాసన

అనంత్ అంబానీ పెళ్లిలో సందడి చేసిన రామ్ చరణ్, ఉపాసన

అనంత్ అంబానీ పెళ్లిలో సందడి చేసిన రామ్ చరణ్, ఉపాసన

Global Star Ram Charan and Upasana Attends Anant Ambani Wedding Ceremony

అనంత్ అంబానీ పెళ్లిలో సందడి చేసిన రామ్ చరణ్, ఉపాసన

భారత దిగ్గజ పారిశ్రామికవేత్త, అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన రెండో కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‍ వివాహం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ వేదికగా జరిగిన ఈ వేడుకలో అనంత్ ఇరు కుటుంబాల సాక్షిగా రాధికా మర్చంట్‍ను పరిణయమాడారు.

ఇక ఈ వేడుకకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హాజరయ్యారు. సతీమణి ఉపాసనతో కలిసి ఆయన కళ్యాణ వేదిక వద్ద ఫోటోలకు ఫోజులిచ్చారు. 'ఆర్ఆర్ఆర్' చిత్రం తరువాత రామ్ చరణ్ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. దీంతో చరణ్ దంపతులను ఫోటోలు తీసేందుకు మీడియా ప్రతినిధులు ఉత్సాహం చూపించారు. అయితే అంతకుముందు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహ వేడుకలు ఆరంభ కార్యక్రమంలో కూడా రామ్ చరణ్ దంపతులు పాల్గొన్న విషయం తెలిసిందే.

కాగా జూలై 12-14 తేదీలలో మూడు రోజులపాటు వీరి కళ్యాణ వేడుకలు ఈ వివాహ వేడుకలు జరుగనున్నాయి. దీనిలో భాగంగా నిన్న ముఖ్య ఘట్టమైన 'శుభ్ వివాహ్' జరుగగా.. శనివారం 'శుభ్ ఆశీర్వాద్', ఆదివారం 'మంగళ్ ఉత్సవ్' నిర్వహించనున్నారు. ఈ వేడుకలలో దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటున్నారు. బాలీవుడ్ నటీ,నటులతోపాటు దక్షిణాది చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్