సిద్ధార్థ్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం

Siddharth 40 Goes on Floors with Pooja Ceremony

స్వతహాగా కోలీవుడ్ నటుడైనప్పటికీ తెలుగునాట కూడా పాపులర్ అయిన హీరో సిద్ధార్థ్. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అయితే ఎందుకనో గత కొంతకాలంగా సిద్దు తమిళ్ చిత్రాలలోనే ఎక్కువగా నటిస్తున్నాడు. ఇదే కోవలో గతేడాది ఆయన నటించి, స్వయంగా నిర్మించిన ‘చిత్తా’ సినిమా ఘనవిజయం అందుకుంది. కలెక్షన్ల పరంగానే కాకుండా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. దీనిని తెలుగులో ‘చిన్నా’ పేరుతో డబ్బింగ్‍ చేసి రిలీజ్ చేశారు. మూవీ కాన్సెప్ట్ బాగున్నప్పటికీ ఇది థియేటర్లలో యావరేజ్‌గా నడించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలావుంటే, తాజాగా సిద్ధార్థ్ నటించిన ‘భారతీయుడు 2’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధానపాత్రలో కనిపించగా, దిగ్గజ దర్శకుడు ఎస్. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సిద్దు ఓ కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం ఇది థియేటర్లలో ఆడుతోంది. ఈ నేపథ్యంలో సిద్దు తాజాగా మరో చిత్రాన్ని పట్టాలెక్కించేశాడు. సిద్దార్థ్ 40వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ తాజాగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమయింది.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఓ గ్లింప్స్ రిలీజ్ చేసింది. కాగా ‘తొట్టక్కల్’ ఫేమ్ శ్రీ గణేష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోంది. ఇందులో కన్నడ నటి, ‘స‌ప్త‌సాగ‌రాలు దాటి: సైడ్ బీ’ ఫేమ్ చైత్ర ఆచార్ సిద్దు సరసన హీరోయిన్‌గా నటిస్తుండగా.. కోలీవుడ్ నటి మీఠా రఘునాథ్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. సీనియర్ నటులు శరత్ కుమార్, దేవయాని ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

శాంతి టాకీస్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ అరుణ్ విశ్వ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇదే బ్యానర్‌పై తొలిసినిమాగా శివకార్తికేయన్ హీరోగా వచ్చిన ‘మావీరన్’ ఘనవిజయం అందుకుంది. ఇక ఈ సినిమాతో పాటుగా సిద్ధార్థ్.. నయనతార, మీరా జాస్మిన్, మాధవన్‌లతో కలిసి నటించిన ‘టెస్ట్’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. అలాగే ఆషికా రంగనాథ్‌తో ‘మిస్ యూ’ అనే ప్రాజెక్ట్‌ లైనప్‌లో ఉంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.