టాలీవుడ్ హీరో మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘కన్నప్ప’. ఒకప్పటి బ్లాక్ బస్టర్ ‘భక్త కన్నప్ప’ సినిమాను రీమేక్ చేయాలనే విష్ణు మంచు కోరిక మేరకు ఇది రూపొందుతోంది. ఈ చిత్రానికి ‘మహాభారతం’ సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో దేశవ్యాప్తంగా పలు సినీ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు నటిస్తుండటం విశేషం. ఇక ఈ సినిమాకు మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ మూవీపై అంచనాలను పెంచేసింది. ఈ నేపథ్యంలో కన్నప్ప చిత్రం నుంచి మేకర్స్ సాలిడ్ అప్‌డేట్ అందించారు. కోలీవుడ్ సీనియర్ నటుడు శరత్ కుమార్ ఇందులో ఓ కీలక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా శరత్ కుమార్ జన్మదినం సందర్భంగా సినిమాలో ఆయన పాత్రను రివీల్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన ‘నాథనాథుడు’గా నటిస్తున్నట్టు వెల్లడించారు. కాగా కన్నప్ప తండ్రే ఈ నాథనాథుడు. చూడబోతుంటే శరత్ కుమార్ పాత్రకు మూవీలో మంచి ఇంపార్టెన్స్ ఉంది.
ఇక భక్తిరస ప్రధానంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో నటిస్తుండగా.. మలయాళ అగ్ర నటుడు మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, శరత్ కుమార్, ప్రీతి ముకుందన్, కాజల్, సీనియర్ నటి మధుబాల తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరించడంతో పాటుగా సినిమాలో ఒక ముఖ్య పాత్రను పోషిస్తుండటం విశేషం. త్వరలోనే కన్నప్ప ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























