‘మోసగాళ్ళు’ మూవీ రివ్యూ

Mosagallu Telugu Movie Review,Mosagallu Movie Review,Latest Telugu Movie Reviews,Latest Telugu Movies News,Latest Tollywood News,Telugu Film News 2021,Telugu Filmnagar,Tollywood Movie Updates,Mosagallu,Mosagallu Movie,Mosagallu Movie Public Response,Mosagallu Movie Public Talk,Mosagallu Movie Review,Mosagallu Movie Review And Rating,Mosagallu Movie Updates,Mosagallu Public Talk,Mosagallu Public Talk And Public Response,Mosagallu Review,Mosagallu Review And Rating,Mosagallu Telugu Movie,Mosagallu Telugu Movie Latest News,Mosagallu Telugu Movie Public Response,Mosagallu Telugu Movie Public Talk,Mosagallu Telugu Movie Review And Rating,Vishnu Manchu,Kajal Aggarwal,Suniel Shetty,Vishnu Manchu Mosagallu Telugu Movie Review,Vishnu Manchu Mosagallu Movie Review,Vishnu Manchu Mosagallu Review,Vishnu Manchu Mosagallu Movie Review And Rating,Vishnu Manchu Mosagallu Movie Story,Vishnu Manchu Mosagallu Movie Live Updates

హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా కాజల్‌ అగర్వాల్, సునీల్‌ శెట్టి ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మోసగాళ్ళు’. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్‌ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ తో సినిమాపై ఆసక్తిని అమాంతం పెంచేశారు చిత్రయూనిట్. నవదీప్‌, నవీన్‌ చంద్ర, రుహాని సింగ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన సినిమాను తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి రూపొందించారు. షెల్డన్ చౌ సినిమాటోగ్రఫి అందిస్తున్న ఈ సినిమాకు.. శ్యామ్ సీఎస్ సంగీతం అందించగా నేడు ఈసినిమా రిలీజ్ అయింది. మరి ఈసినిమా ఎలా ఉందో రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మూవీ నేమ్ : మోసగాళ్లు (తెలుగు)
బ్యానర్ : ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ
డైరెక్టర్ : డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్
కాస్ట్ : మంచు విష్ణు,కాజల్‌ అగర్వాల్, సునీల్‌ శెట్టి,రుహి సింగ్ ,నవీన్ చంద్ర ,నవదీప్
మ్యూజిక్ : సామ్ సి యస్

కథ..

అర్జున్ (మంచు విష్ణు), అను (కాజల్ అగర్వాల్) మధ్య తరగతి జీవితాన్ని జీవిస్తుంటారు. తమ తండ్రి తనికెళ్ళ భరణి నీతి, నిజాయితీ వల్లే ఈపరిస్థితిలో ఉన్నామని ఫీలవుతుంటారు. ఇక బాగా డబ్బు సంపాదించాలన్న కోరికతో విజయ్ (నవదీప్) తో కలిసి భారీ స్కామ్ మొదలు పెడతారు. ఇంట‌ర్న‌ల్ రెవెన్యూ స‌ర్వీస్ పేరుతో అమెరిక‌న్‌ల‌కు ఫోన్ చేసి ప‌న్ను బ‌కాయిలు చెల్లించాల‌ని బెదిరించి అక్ర‌మంగా డ‌బ్బు సంపాదించ‌డం మొద‌లుపెడ‌తారు. వీరికి అర్జున్ అక్క అను తోడై ఈ భారీ మోసానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు చూసుకుంటూ ఉంటుంది. ఇక వీరి చేసిన స్కామ్ బయటకు రావడంతో ఈ స్కామ్‌ని ఛేదించే ఆఫీసర్‌గా ఏసీపీ కుమార్ (సునీల్ శెట్టి) రంగంలోకి దిగుతాడు. ఇక ఏసీపీ కుమార్ నుండి బయటపడటానికి అను అండ్ అర్జున్ టీమ్ ఎత్తులకు పైఎత్తులు వేస్తుంటారు. మరి ఫైనల్ గా వారు ఎలా చిక్కుతారు అన్నదే అసలు కథ

విశ్లేషణ..

నిజానికి ఈసినిమా మంచు విష్ణు కు చాలా కీలకం. సరైన హిట్ లేక గత కొంత కాలంగా సతమతమవుతున్నాడు. అంతేకాదు ఈసినిమా కోసం తనకున్నది మొత్తం పెట్టానని కూడా చాలా సార్లు ప్రెస్ మీట్లలోకూడా చెప్పాడు. ఇక ఈసినిమా చూసిన తరువాత విష్ణు పెట్టుకున్న నమ్మకం నిజమైందని చెప్పొచ్చు. ఓ అక్క, తమ్ముడు కలిసి భారీ మోసానికి పాల్పడటం అనేది ఈ సినిమాలో డిఫరెంట్ పాయింట్. ఇలాంటి క‌థ‌ను ఎంచుకోవడం సులభమే కానీ, దాన్ని తెరపై ఎలా థ్రిల్లింగ్‌ చూపించారు అనేదే ముఖ్యం. లవ్ స్టోరీస్ అంటే హీరో హీరోయిన్స్ మథ్య లవ్ ట్రాక్ పాటలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి లాగించేయోచ్చు. కానీ ఈసినిమాలో అలాంటివి ఉండవు. రెండున్నర గంటలు ప్రేక్షకుడిని కూర్చోపెట్టాలి. డైరెక్టర్ ఆవిషయంలో సక్సెస్ అయ్యాడు.

సాధారణ మధ్య తరగతి వ్యక్తి వేల కోట్ల రూపాయల స్కామ్ ఎలా చేశాడో చూపిస్తూ కథను ఆసక్తికరంగా మలిచాడు డైరెక్టర్. ఈరోజుల్లో ఎక్కడ చూసినా ఆన్ లైన్ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. వాటి వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కళ్ళకు కట్టినట్లు చూపించిన విధానం ఆకట్టుకుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం అను, అర్జున్‌ ల ఇంట్రడక్షన్.. త‌ర్వాత అర్జున్ ఓ కాల్ సెంటర్‌లో ప‌నిచేయ‌డం.. దాని ద్వారా అక్ర‌మంగా అమెరిక‌న్ల డేటాను సేక‌రించి అమ్మడం.. ఈ క్రమంలో విజయ్ కలిసి ఓ భారీ స్కాంకి స్కెచ్‌ వేయడం.. ఇలా కథని చకచకగా నడిపించి బోర్‌ కొట్టకుండా నడిపించేశాడు. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌.. క్లైమాక్స్‌లో సునీల్ శెట్టి, మంచు విష్ణుల‌కి మ‌ధ్య వ‌చ్చే యాక్ష‌న్ ఎపిసోడ్.. ప్రీ ఇంటర్వెల్ సీన్స్, క్లైమాక్స్ హైలైట్. ఇలాంటి భారీ స్కాములు చేసేవాళ్లు బయట ఎంత లగ్జరీగా బ్రతుకుతున్నారో మరోకోణంకూడా చూపించారు.

ఇక అర్జున్‌ పాత్రలో మంచు విష్ణు ఒదిగిపోయాడు. ఇంతవరకూ చూడని విష్ణుని ఈ సినిమాలో చూడొచ్చు. కాజల్ నటన కూడా మరో అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. ఏసీపీ ఆఫీసర్‌గా సునీల్ శెట్టి రోల్ సినిమాకు ప్లస్ అయింది. వెంకటేష్ వాయిస్ ఓవర్ సినిమాకు మరో అట్రాక్షన్.

మంచు విష్ణు నిర్మాతగా నిర్మించిన ఈసినిమాలో ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్ గా ఉంటుంది. మంచు విష్ణు సినిమాల్లోనే ద రిచ్చెస్ట్ ప్రొడక్షన్ వాల్యుస్ ఉన్న సినిమాగా ఇది నిలిచిపోతుంది. సామ్‌ సి.ఎస్‌ నేపథ్య సంగీతం మరో హైలెట్. కొన్ని సన్నివేశాలకు తన బీజీఎంతో ప్రాణం పోశాడు.

ఓవరాల్ గా చెప్పాలంటే డబ్బు అన్నింటకి ఎంత ఇంపార్టెన్సో చెపుతూనే అదే డబ్బు వల్ల కొన్ని సమస్యలు కూడా వస్తాయని చెప్పకెనే చెపుతూనే మన లా సిస్టమ్ లో ఎలాంటి లూప్ హోల్స్ ఉన్నాయో సెటైరికల్ వే చూపించారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here