అమిగో క్రియేషన్స్ , శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ నేపథ్యం లో రూపొందిన “లవ్ స్టోరీ “మూవీ ఏప్రిల్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. , దేవయాని, రావు రమేష్ , పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. సిహెచ్ పవన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై
ఆసక్తిని కలిగించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
సంగీత దర్శకుడు పవన్ స్వరకల్పన లో రైటర్ సుద్దాల అశోక్ తేజ రచించగా మంగ్లీ గానం చేసిన ఫోక్ సాంగ్ “సారంగదరియా ” 14 రోజులలో 50 మిలియన్ వ్యూస్ సాధించి న్యూ రికార్డ్ నెలకొల్పింది. ఈ సాంగ్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సాయి పల్లవి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి కథానాయికగా రూపొందిన “విరాటపర్వం “మూవీ ఏప్రిల్ 30 వ తేదీ రిలీజ్ కానుంది. నాని హీరోగా రూపొందుతున్న “శ్యామ్ సింగ రాయ్ “మూవీ లో సాయి పల్లవి ఒక కథానాయికగా నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ “ఫిదా “మూవీ తరువాత దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన “లవ్ స్టోరీ “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)