ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా ఆదిపురుష్. రామాయణం నేపథ్యంలో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమా కోసం ఎప్పటినుండో అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఫైనల్ గా ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఆదిపురుష్ సినిమా రిలీజ్ కు ముందే ఎన్నో ప్రత్యేక విశేషాలను సంతరించుకుంది. ప్రీ రిలీజ్ ఏర్పాట్ల దగ్గర నుండి టికెట్ బుకింగ్స్ లో అలానే ఈసినిమాకు కొంతమంది సెలబ్రిటీలు సైతం ముంకొచ్చి పేద పిల్లలకు సైతం సినిమాను చూపించాలన్న ఉద్దేశంతో టికెట్లను కొనుగోలు చేయడం లాంటి ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రిలీజ్ తరువాత ఈసినిమా అప్పుడే కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేయడం మొదలుపెట్టింది. ఎన్నో అంచనాల మధ్య నేడు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మొదటిసారి ఒక్క నైజాంలోనే ఈసినిమా వెయ్యికి పైగా మల్టీప్లెక్సుల్లో రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వడమే కాదు ప్రతి థియేటర్ కూడా హౌస్ ఫుల్ అవ్వడం విశేషం. ఇంకా ఫ్యామిలీస్ కూడా సినిమాను చూడటానికి పెద్ద ఎత్తున మ్యాట్నీ షోస్ కు వస్తున్నారని తెలియచేస్తున్నారు మైత్రీమూవీస్ ఎల్ఎల్పీ డిస్ట్రిబ్యూటర్ శశి. ఇక ఈసినిమా యూఎస్ ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్డ్ కూడా వచ్చేసింది. ఒక్క రోజులోనే 1మిలియన్ డాలర్లను సొంతం చేసుకొని అప్పుడే రికార్డుల ఖాాతా తెరిచింది. మరి ఈసినిమా ముందు ముందు ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
కాగా 3డీ విజువల్ ఎఫెక్ట్స్ తో మైథలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈసినిమాలో రాముని పాత్రలో ప్రభాస్ నటించగా.. సీతగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్.. అలాగే లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ నటించారు. ఈ సినిమాను టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలపై బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























