టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోల్లో వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరోల్లో అడివి శేష్ పేరు ముందుంటుంది. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు అడివి శేష్. ఇక గత ఏడాది మేజర్ సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్నాడు. ముంబై బాంబు దాడుల్లో అమర వీరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. దేశవ్యాప్తంగా ఈసినిమా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుందో చూశాం కదా. శేష్ తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. సందీప్ పాత్రలో అడివి శేష్ పెర్ఫార్మన్స్, యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సన్నివేశాలు ఈ మూవీకి ప్రధాన బలంగా నిలిచాయి. రీసెంట్ గానే మాజీ రాష్టపతి శ్రీరామ్ నాథ్ కోవిద్ కూడా ఈసినిమాపై ప్రశంసలు కురిపించిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా రిలీజ్ అయి నేటితో ఒక ఏడాది పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో అడివి శేష్ ఈసినిమా గురించి గుర్తుచేసుకుంటూ తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశాడు. మేజర్ సినిమా విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా అమ్మ, అంకుల్ ను కలిశాను. అమ్మ తన భుజం నొప్పి ఉన్నప్పటికీ అద్భుతమైన వంట చేసి పెట్టింది. వారి ప్రేమ నా ప్రతి విషయంలో ఉంటుంది. మేజర్ సందీప్ బ్లెస్సింగ్స్ నాకు ఉన్నాయి..నాకు తెలియని విధంగా ఆయన నన్ను మార్చారు. మేజర్ సినిమా నాకు మరపురాని చిత్రం. ఈసందర్భంగా మహేష్ సార్‌కి, మా నిర్మాతలకు, దర్శకుడికి, కష్టపడి పనిచేసిన టీమ్‌కి, రివర్టింగ్ పెర్ఫార్మెన్స్ని అందించిన మా నటీనటులకు థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అన్నింటికంటే ముఖ్యంగా ప్రేక్షకులు మా మీద చూపించిన ప్రేమ, గౌరవం అపారమైనది. నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీ గౌరవాన్ని ఎప్పటికీ మర్చిపోలేను అంటూ పోస్ట్ చేశాడు.
Got my darshan with Amma & Uncle for the 1 year Anniversary of #Major. Amma cooked some amazing food despite her shoulder pain. Their love ❤️ has meant everything to me. #MajorSandeepUnnikrishnan has blessed me and changed me in ways I never knew. ❤️#MajorTheFilm is my most… pic.twitter.com/y3MttrqQCg
— Adivi Sesh (@AdiviSesh) June 3, 2023
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: