టాలెంటెడ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో అభిరామ్ హీరోగా వస్తున్న సినిమా అహింస టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ సురేష్ తనయుడు, టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు రానా తమ్ముడు కావడంతో ఈసినిమా పై మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఈసినిమా జూన్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా తేజ కూడా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేశాడు. ఈ సందర్భంగా తేజను స్టార్ హీరోలతో సినిమాలు చేయాలంటే ఏ జోనర్ లో చేస్తారు అని అడుగగా దానికి తేజ ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ తెలియచేశాడు. పవన్ కళ్యాణ్ తో ఎలాంటి సినిమా చేస్తానో తెలియదు కానీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గ్లింప్స్ అయితే అదిరిపోయింది అలా ఉండాలి అని తెలిపాడు. రామ్ చరణ్ పేరు చెప్పగా నేను ఇంకా ఏం అనుకోలేదు అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పగా.. తనతో చేసే టాలెంట్ నాకు లేదని తెలిపారు. ఇంకా ప్రభాస్ తో మంచి యాక్షన్ సినిమా చేయాలని.. ప్రాజెక్ట్ కే కూడా నాకు సాఫ్ట్ అనిపిస్తది. ఛత్రపతిని మించి సాలిడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ తీయాలని స్పష్టం చేశాడు. చూద్దాం ఫ్యూచర్ లో ఏదైనా స్టార్ హీరోతో తేజ సినిమా చేసే అవకాశం వస్తుందేమో..
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: