రీసెంట్ గా విడుదలై మలయాళం లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన చిత్రం 2018.ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 160కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.కేరళలో అయితే 80కోట్ల గ్రాస్ తో ఆల్ టైం నెంబర్ వన్ మూవీ గా రికార్డు సృష్టించింది.ఇక ఈసినిమా గత శుక్రవారం తెలుగులో కూడా విడుదలైయింది.రివ్యూస్ తోపాటు మౌత్ టాక్ కూడా పాజిటివ్ గా ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో ఈసినిమా 4.35కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.పెద్దగా ప్రమోషన్స్ ఏమి లేకున్నా ఈరేంజ్ వసూళ్లు రాబట్టడం గొప్ప విషయమే.మంచి కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు పర భాష చిత్రాలను కూడా ఆదరిస్తారని 2018తో మరోసారి రుజువైంది.ఈసినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ రిలీజ్ చేశారు.2కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈసినిమా 3రోజుల్లో 2.03కోట్ల షేర్ ను రాబట్టి బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
2018 లో కేరళలో సంభవించిన వరదల నేపథ్యంలో డైరెక్టర్ జూడ్ అంథాని జోసెఫ్ తెరకెక్కించిన ఈసినిమాలో టోవినో థామస్,అసిఫ్ అలీ,లాల్,అపర్ణ బాలమురళి తదితరులు కీలకపాత్రల్లో నటించారు. యధార్థ సంఘటనల ఆధారంగా రియలిస్టిక్ గా రూపొందిన ఈసినిమాకు నోబిన్ పాల్ సంగీతం అందించాడు.వేణు కున్నప్పిలీ,పద్మా కుమార్,అంటో జోసెఫ్ నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: