తమిళ్ హీరో విశాల్ మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. సినిమా జయాపజయాలను పక్కనపెట్టి తన సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇక ఇప్పుడు మార్క్ అంథోని అని రాబోతున్నాడు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈసినిమా రాబోతుంది. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇప్పటికే విడుదల చేసిన మోషన్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. తాజాగా ఈసినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు మేకర్స్. ఏప్రిల్ 27వ తేదీన ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో విశాల్ కు జోడీగా రీతూవర్మ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఎస్ జె సూర్య, సునీల్, సెల్వ రాఘవన్ కూడా పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మినీ స్టూడియో బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తుండగా.. జి.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. మరి మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న విశాల్ కు ఈసినిమాతో అయినా హిట్ అందుతుందో లేదో చూద్దాం..
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: