ఉపాసన వెలకట్టలేని క్షణాలు

upasana shares priceless moments with mega family

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా ఆ క్షణం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇరు కుటుంబాలు ఆ ఆనంద సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక
ఆమధ్య రామ్ చరణ్, ఉపాసన బేబీ షవ‌ర్ సెల‌బ్రేష‌న్స్‌ దుబాయ్ లో ఘనంగా నిర్వహించిన సంగతి గుర్తుండే ఉంటుంది. అప్పుడు వారి ద‌గ్గ‌రి స్నేహితులు, కుటుంబ స‌భ్యులు మాత్ర‌మే పాల్గొన్నారు.
ఇక మరోసారి ఇక్కడ నిన్న ఘనంగా ఉపాసన బేబీ షవర్ వేడుకలు జరిపారు. ఈకార్యక్రమానికి అటు చరణ్, ఇటు ఉపాసన కుటుంబసభ్యులతో పాటు ఇతర సెలబ్రిటీలు కూడా చాలామంది పాల్గొన్నారు. రాబోయే బిడ్డకు బ్లెస్సింగ్స్ అందించారు. ఈనేపథ్యంలో ఉపాసన వేడుకకు సంబంధించిన ఫొటోలు పోస్ట్ చేస్తూ తన సంతోషాన్ని పంచుకుంది. అందరి ప్రేమకు థ్యాంక్స్.. మా బేబీ నిజంగా చాలా బ్లెస్డ్.. వెలకట్టలేని క్షణాలు అంటూ పోస్ట్ లో పేర్కొంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రస్తుతం రామ్ చరణ్ లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు. ఇక ఈసినిమా తరువాత బుచ్చిబాబు తో సినిమా చేయనున్నాడు. ఇటీవలే ఈసినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే కదా.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − three =