సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా వస్తున్న సినిమా ఏజెంట్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ తరువాత అఖిల్ నుండి చాలా గ్యాప్ తరువాత వస్తున్న సినిమా ఇది. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఫుల్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాలో అఖిల్ తన కొత్త మేకర్ తో అలరించనున్నాడు. ఇక ఈసినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ తో పాటు పాటలు కూడా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మరో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. వైల్డ్ సాలా అంటూ వచ్చే ఈపాటలో విజువల్స్ కూడా అంతే వైల్డ్ గా ఉన్నాయి. ఈపాటలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈపాటను మాత్రం భీమ్స్ కంపోజ్ చేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథను వక్కంతం వంశీ అందించారు. హిప్ హాప్ తమీజా సంగీతం సమకూర్చారు. రసూల్ ఎల్లోర్ కెమెరా మెన్ గా పని చేస్తున్నారు. ఎకె ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్. మరి ఈసినిమాతో అయినా అఖిల్ మంచి బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుంటాడేమో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
AGENT Akhil Birthday Special Interview with Suma Kanakala | Happy Birthday Akhil Akkineni | TFN
21:10
AGENT Teaser Launch | Akhil Akkineni | Mammootty | Sakshi Vaidya | Surender Reddy | Thaman S | TFN
01:53
AGENT Motion Teaser | Akhil Akkineni | Mammootty | Sakshi Vaidya | Surender Reddy | Thaman | FanMade
01:13
AGENT Teaser Review | Akhil Akkineni | Mammootty | Sakshi Vaidya | Surender Reddy | Thaman S | TFN
02:02
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: