విరూపాక్ష 3డేస్ కలెక్షన్స్ చూస్తే మైండ్ బ్లాక్

virupaksha movie 3days worldwide collections

సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది.గత శుక్రవారం విడుదలైన ఈసినిమా పాజిటివ్ రివ్యూస్,టాక్ తో బ్రేక్ ఈవెన్ కు చేరువైంది.మొదటి రోజు కన్నా మిగితా రెండు రోజులు ఎక్కువ కలెక్ట్ చేయడం విశేషం.మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 4.70కోట్ల షేర్ ను రాబట్టుకోగా రెండో రోజు 5.80షేర్ ను రాబట్టింది.ఇక నిన్న అదే ఊపును కొనసాగిస్తూ చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడడంతో 5.70 కోట్ల షేర్ ను రాబట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అటు యూఎస్ఏ లోనూ విరూపాక్ష అదరగొడుతుంది.మూడు రోజుల్లో 700k డాలర్లను రాబట్టి 1మిలియన్ క్లబ్ లోకి చేరువైంది.దాంతో సాయి ధరమ్ తేజ్ కి ఇదే మొదటి వన్ మిలియన్ డాలర్ సినిమా కానుంది.ఇక మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 44కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించగా ఇందులో షేర్ 21కోట్లు.రేపటి తో ఈసినిమా బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేయనుంది. ఓవరాల్ గా ఫస్ట్ వీకెండ్ అంచనాలకు మించి వసూళ్లను కలెక్ట్ చేయడంతో ఈసినిమా సాయి తేజ్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలువనుంది.

మిస్టరీ హారర్ర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన విరూపాక్షలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు డైరెక్ట్ చేశాడు.సునీల్,సాయి చంద్, అజయ్,బ్రహ్మజీ ముఖ్య పాత్రల్లో కనిపించారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించగా ఎస్విసిసి,సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.