దిల్ రాజు వారసుడిగా రౌడీ బాయ్స్ అనే సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు ఆశిష్ రెడ్డి. కాలేజ్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈసినిమా యూత్ ను బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకట్టుకున్నాడు ఆశిష్ రెడ్డి. తన డ్యాన్స్, యాక్షన్ సీక్వెన్స్ లతో అందరినీ మెప్పించాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన కాశీ ఈసినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈసినిమాకు సెల్ఫిష్ అనే టైటిల్ ను కూడా పెట్టారు. ఈసినిమాలో ఆశిష్ మాస్ క్యారెక్టర్లో నటిస్తున్నట్టు ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లను బట్టి అర్థమవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు చిత్రబృందం. ఇక తాజాగా ఈసినిమాలో నటించనున్న హీరోయిన్ గురించి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాలో లవ్ టుడే ఫేమ్ ఇవానా హీరోయిన్ గా నటిస్తున్నట్టు ప్రకటించారు. ఇవానా చైత్ర అనే పాత్రలో నటించనుంది. ఇవానా ఇందులో ఫైనాన్సియల్ ఎనలిస్ట్ గా కనిపిస్తుంది. ఆశిష్ ఆమెని తదేకంగా చూస్తునట్లుగా కనిపించారు.
నా పోరి ‘చైత్ర’ ని రిజర్వేషన్ చేషినా 👊🏼
Reserving the sparkling actress ✨ @_Ivana_official as CHAITRA to the world of #Selfish ❤️
More Exciting Details soon 💥#Ashish @aryasukku #DilRaju #KasiVishal @MickeyJMeyer @SVC_official @SukumarWritings @Ashokbandreddi pic.twitter.com/qsVq3pyJD4
— Sri Venkateswara Creations (@SVC_official) April 22, 2023
కాగా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రానున్న ఈసినిమాను సుకుమార్ రైటింగ్స్ మరియు దిల్ రాజు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించనున్నారు. హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, అశోక్ బండ్రెడ్డి ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా మణికందన్ పని చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: