సంగీతం : అజనీష్ లోక్ నాథ్
ఎడిటింగ్ :నవీన్ నూలి
సినిమాటోగ్రఫీ :శ్యామ్ దత్
దర్శకత్వం :కార్తిక్ దండు
నిర్మాత :బివిఎస్ఎన్ ప్రసాద్
టీజర్,ట్రైలర్ తో మంచి హైప్ తెచ్చుకున్న సినిమా విరూపాక్ష.సాయి ధరమ్ తేజ్,సంయుక్త మీనన్ జంటగా కార్తీక్ దండు తెరకెక్కించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ ఈరోజు ప్రేక్షకులముందుకు వచ్చింది.మరి ఈసినిమా ఎలా వుందో ఇప్పుడు చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కథ :
ఈకథ 1979-91 మధ్యలో జరుగుతుంది.రుద్రవరం అనే ఊరు..ఆ ఊరులో చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో భార్య భర్తను ఊరంతా కలిసి సజీవదహనం చేస్తారు.ఆసమయంలో ఆఇద్దరు..సరిగ్గా 12 సంవత్సరాల తరువాత ఊర్లో అందరు చనిపోతారని ఊరుకి శాపం పెడుతారు.ఇక అలాగే జరుగుతుంది.ఊర్లో వరసగా మరణాలు సంభవిస్తాయి.ఈ మరణాలను ఆపడానికి ఆఊరుని అష్ట దిగ్బంధనం చేస్తారు అయినా కూడా చావులు ఆగవు.ఈక్రమంలో దీనికి పరిష్కారం వెతకడానికి సూర్య ( సాయి ధరమ్ తేజ్) రంగం లోకి దిగుతాడు.మరి ఈ సమస్యకు పరిష్కారం దొరికిందా? అసలు వరస మరణాలకు..చనిపోయిన భార్య భర్త పెట్టిన శాపమే కారణమా అనేదే మిగితా కథ.
విశ్లేషణ :
విరూపాక్షలో చాలా ప్లస్ పాయింట్స్ వున్నాయి.ఒక మిస్టరీ థ్రిల్లర్ కు కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని ఉండేలా చూసుకొని దాని తెర మీదకు తీసుకొచ్చాడు డైరెక్టర్ కార్తిక్ దండు.ఇలాంటి సినిమాలకు కథ ఒక్కటే సరిపోదు ఆసక్తిగా కలిగించే స్క్రీన్ ప్లే కూడా కావాలి.ఈవిషయం లో విరూపాక్ష ఎక్కడా డిస్సపాయింట్ చేయదు. వీటికీ తోడు అద్భుతమైన ట్విస్టులు సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయి.సినిమా ప్రారంభంలో కాసేపు లవ్ స్టోరీ తో టైం పాస్ చేయించినా ఆ తరువాత కథ లోకి వెళ్ళగానే సినిమాపై ఆసక్తి పెరుగుతుంది.తరువాత ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీని పెంచేస్తూ ఇంటర్వెల్ కార్డు పడుతుంది.ఇక సెకండ్ హాఫ్ లో సినిమా పీక్స్ లోకి వెళ్తుంది.ఇందులో వచ్చే చాలా సన్నివేశాలు బయపెడతాయి.క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ థ్రిల్ చేస్తుంది.
సినిమాకు మరో ప్లస్ పాయింట్ ఏంటంటే బీజీఎమ్ మరియు సౌండ్ మిక్సింగ్.ఇలాంటి జోనర్ సినిమాలకు ఈరెండు ఎంత ముఖ్యమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.ఇక ఈ విరూపాక్ష కు బీజీఎమ్ ను అంతే అద్భుతంగా ఇచ్చాడు కాంతారా ఫేమ్ అజనీష్ లోక్ నాథ్. దీనికి తోడు రాజా కృష్ణన్ సౌండ్ మిక్సింగ్ సినిమాకు ప్రాణం పోశాయి.చిన్న చిన్న సీన్లు కూడా ఎలివేట్ అయ్యాయి.
నటీనటుల విషయానికి వస్తే క్యాస్టింగ్ సినిమాకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. ముఖ్యంగా సూర్య పాత్రలో సాయి ధరమ్ తేజ్ యాక్టింగ్ సినిమాకు హైలైట్.తన కెరీర్ లో ది బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు.అలాగే సంయుక్త మీనన్ కు పవర్ ఫుల్ రోల్ దక్కింది.ఆపాత్రలో తన నటన ఆకట్టుకుంటుంది. కేవలం యాక్టింగ్ పరంగానే కాదు స్క్రీన్ పై సంయుక్త చాలా గ్లామర్ గా కనిపించింది.మిగితా కీలక పాత్రల్లో కనిపించిన సునీల్,అజయ్ ,బ్రహ్మజీ,సాయి చంద్ వారి పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా వుంది.అజనీష్ లోక్ నాథ్ సాంగ్స్ డీసెంట్ గా వున్న బీజీఎమ్ మాత్రం థ్రిల్ చేస్తుంది.సినిమాటోగ్రఫీ బాగుంది.విలేజ్ వాతావరణాన్ని చాలా బాగా చూపించాడు.విజువల్స్ బాగున్నాయి.ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఓవరాల్ గా మిస్టరీ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈసినిమాలో లీడ్ పెయిర్ యాక్టింగ్,స్క్రీన్ ప్లే ,బీజీఎమ్ ,విజువల్స్ హైలైట్ అయ్యాయి.ఈజోనర్ ను ఇష్టపడే వారికి ఈసినిమా విపరీతంగా నచ్చుతుంది అలాగే మిగతావారికి కూడా బిగ్ స్క్రీన్ మీద చూస్తే విరూపాక్ష మంచి అనుభూతిని ఇస్తుంది.
విరూపాక్ష ట్రైలర్:
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.