టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య నుండి ఈ ఏడాది వస్తున్న మొదటి సినిమా కస్టడీ. టాలెంటెడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా తెలుగు, తమిళ్ ద్విభాషా చిత్రంగా ఈసినిమా రానుంది. ఈసినిమాలో చైతు పోలీస్ పాత్రలో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు మేకర్స్. దీనిలో భాగంగానే ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గర నుండి క్యారెక్టర్ పోస్టర్ లు, టీజర్, ఫస్ట్ సింగిల్ అన్నీ అలరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమా నుండి మరో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. టైమ్‌లెస్ లవ్ అనే రెట్రో థీమ్ పాటను విడుదల చేశారు. ఈ రెట్రో థీమ్ మెలోడీని మాస్ట్రో ఇళయరాజా స్వరపరచగా యువన్ శంకర్ రాజా అరెంజ్ చేశారు. ఈ సంగీత ద్వయం ఇన్‌స్ట్రుమెంటేషన్‌తో పాటకు వింటేజ్ వైబ్‌లను తీసుకొచ్చారు. వింటేజ్ టచ్ ఇచ్చేలా ఏడు భారీ, వైబ్రెంట్ సెట్స్‌లో పాటని చిత్రీకరించారు. నాగ చైతన్య తన ఆరో తరగతి నుండి తన ప్రేమ కథను వివరించాడు. చై, కృతి శెట్టి ఛార్మింగా కనిపించారు. విజువల్స్ మరింత ఆకర్షణీయంగా కనిపించాయి. ఇందులో సాక్సోఫోన్, ఫ్లూట్, ట్రంపెట్, ట్రోంబోన్ బిట్‌లు సంగీత ప్రియులని అలరిస్తున్నాయి. యువన్ శంకర్ రాజా, కపిల్ కపిలన్ ఈ పాటని చాలా అద్భుతంగా ఆలపించారు.
Feel the Vintage Vibrant Melody Magic along with @chay_akkineni & @IamKrithiShetty!🕺💃
Here’s the #TimelessLove lyrical❤️
Tel: https://t.co/HWTsTRlx0l
Tam: https://t.co/qNGjmkUBIv🎤 @KapilKapilan_
✍️ @ramjowrites, @madhankarky
🕺 @Sekharmasteroff #CustodyOnMay12 pic.twitter.com/Q1yhlXKTA3— Srinivasaa Silver Screen (@SS_Screens) April 23, 2023
కాగా ఈసినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. సంపత్ రాజ్, శరత్ కుమార్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























