కెరీర్ ప్రారంభం నుండి తన కామెడీ సినిమాలతో ప్రేక్షకులను కితకితలు పెట్టించిన అల్లరి నరేష్ ఇప్పుడు తన రూట్ ను మార్చాడు. ఇక చాలా కాలం గ్యాప్ తీసుకొని నాంది సినిమాతో మంచి కమ్ బ్యాక్ ను అందుకున్నాడు. ప్రస్తుతం విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఉగ్రం అనే సినిమాతో వస్తున్నాడు. నాంది సినిమా తరువాత వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమా ఇది. ఆ సినిమా సక్సెస్‌తో మరోసారి వీరిద్దరూ ఇప్పుడు ఉగ్రం సినిమా కోసం చేతులు కలిపారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా వస్తున్నట్టు ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ను బట్టి అర్థమైంది. ఇకఈ సినిమా మే 5న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో వరుస అప్‌డేట్‌లు ప్రకటిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ ను బట్టి మిస్సింగ్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా వస్తున్నట్టు అర్థమవుతుంది. ఇక అల్లరి నరేష్ మాత్రం తన నట విశ్వరూపం చూపించాాడు. అల్లరి నరేష్ రెండు డిఫరెంట్ వేరియేషన్స్ లో కనిపిస్తున్నాడు. ట్రైలర్ లో క్రైమ్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఉండటంతో సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. మొత్తానికి ట్రైలర్ తో సినిమాపై అంచనాలను అయితే పెంచేశారు. మరోసారి వీరిద్దరూ మరో హిట్ ను సొంతం చేసుకుంటారని అనిపిస్తుంది.
ఈసినిమాలో అల్లరి నరేష్ సరసన మిర్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈసినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. మాటలు అబ్బూరి రవి అందిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా, సిద్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. మరి చూద్దాం ఈసినిమా ఎంతవరకూ ప్రేక్షకులను అలరిస్తుందో.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























