నటీనటులు: కిరణ్ అబ్బవరం, అతుల్య రవి, సప్తగిరి
సంగీతం :సాయి కార్తీక్
ఎడిటింగ్ : కార్తీక్ శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ : వెంకట్ సి దిలీప్
దర్శకత్వం : రమేష్ కడూరి
నిర్మాతలు : చిరంజీవి,హేమలత
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ ఏడాది ఫిబ్రవరి లో వినరో భాగ్యము విష్ణు కథతో వచ్చి హిట్ కొట్టాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఇక ఇప్పుడు ఈ హీరో,మీటర్ తో థియేటర్లలోకి వచ్చాడు. ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడం అలాగే బిగ్ ప్రొడక్షన్ మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వస్తున్న సినిమా కావడంతో మీటర్ పై మంచి అంచనాలు వున్నాయి. మరి ఈ రోజు విడుదలైన ఈచిత్రం ఆ అంచనాలను అందుకుందో లేదో చూద్దాం.
కథ :
పోలీస్ డిపార్ట్ మెంట్ లో తన తండ్రికి జరిగిన అవమానాలను చూసి జీవితంలో పోలీస్ ఆఫీసర్ కావొద్దని అనుకుంటాడు అర్జున్ కళ్యాణ్(కిరణ్ అబ్బవరం) కానీ తన తండ్రి కోరిక మేరకు చివరకు సబ్ ఇన్స్పెక్టర్ కావాల్సి వస్తుంది. దాంతో అర్జున్ తన ఉద్యోగం పోగొట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తాడు కానీ అవి ఫలించకపోక తనకు మంచి పేరును తెచ్చిపెడుతాయి. ఈ క్రమంలో హోమ్ మినిస్టర్ బైరెడ్డి వల్ల అర్జున్ జీవితం మలుపు తిరుగుతుంది. ఇంతకీ హోం మినిస్టర్ వల్ల అర్జున్ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటాడు. చివరకు హోమ్ మినిస్టర్ చేసిన కుంభకోణం నుండి పోలీస్ వ్యవస్థను, అర్జున్ ఎలా కాపాడనేదే మిగతా కథ.
విశ్లేషణ :
పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా మూవీని తెరకెక్కించాడు డైరెక్టర్ రమేష్ కడూరి. స్టోరీ లో కొత్తదనం లేకున్నా దాన్ని తీర్చిదిద్దిన విధానం మాత్రం ఆకట్టుకుంటుంది. ఇప్పటివరకు సాఫ్ట్ రోల్స్ చేసుకుంటూ వచ్చిన కిరణ్ అబ్బవరం ఈసినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించి మాస్ ప్రేక్షకులు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం ఫలించింది కూడా. ఫస్ట్ హాఫ్ లో పోలీస్ అవ్వకుండా కిరణ్ చేసే ప్రయత్నాలు అందులో నుంచి వచ్చే ఫున్ బాగుంటుంది. ఆ తరువాత తన తండ్రి కోరిక మేరకు తప్పనిసరి పరిస్థితుల్లో పోలీస్ అవ్వాల్సిరావడం దాంతో ఆ ఉద్యోగం పోగొట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తాడు. ఆ క్రమంలో హీరోయిన్ అతుల్య రవి తో ప్రేమలో పడతాడు. ఇక ఇంటర్వెల్ ముందు హోమ్ మినిస్టర్ పాత్ర ఎంట్రీ ఇవ్వడం, అక్కడునుంచి వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది.దాంతో సెకండ్ హాఫ్ మీద ఆసక్తి పెరుగుతుంది. ఇంటర్వల్ తరువాత హోమ్ మినిస్టర్ తో అర్జున్ కళ్యాణ్ కు తలపడడం.. చివరికి అర్జున్ కళ్యాణ్ ,హోమ్ మినిస్టర్ స్కామ్ ను ఛేదించి పోలీస్ వ్యవస్థ ను కాపాడడం తో సినిమా ముగుస్తుంది. ఓవరాల్ గా యాక్షన్ ఎంటర్ టైనర్ తో కూడిన ఈ సినిమా ఆకట్టుకుంటుంది.
పెరఫార్మెన్స్ :
మీటర్ లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కిరణ్ అబ్బవరం ఒదిగిపోయాడు. యాక్షన్ ,కామెడీ సన్నివేశాల్లో తన ప్రతిభ చూపెట్టాడు. చాలా ఈజ్ తో అర్జున్ కళ్యాణ్ పాత్రను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక కిరణ్ తరువాత హోమ్ మినిస్టర్ గా విలన్ పాత్రలో నటించిన పవన్ నటన ఆకట్టుకుంటుంది. ఈ సినిమా తరువాత పవన్ కు మరిన్ని అవకాశాలు వస్తాయి ఇక అలాగే ఈసినిమా తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన తమిళ హీరోయిన్ అతుల్య రవి కూడా బాగా చేసింది. వీరితో పాటు మిగితా పాత్రల్లో నటించిన పోసాని కృష్ణ మురళి , సప్తగిరి తమ పాత్రల పరిధి మేర నటించారు.
సాంకేతిక విభాగం :
పక్క యాక్షన్ ఎంటర్టైనర్ గా మీటర్ ను తెరకెక్కించాడు డైరెక్టర్ రమేష్ కడూరి. తనకు ఇది మొదటి సినిమా అయినా బాగానే డీల్ చేశాడు. ఇక మిగితా టెక్నిషియన్స్ కూడా బాగానే సపోర్ట్ చేశారు. అందులో భాగంగా సాయి కార్తీక్ అందించిన సంగీతం అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ అలాగే వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. చిరంజీవి , హేమలత మంచి క్వాలిటీ తో సినిమాను నిర్మించారు.
తీర్పు :
ఓవరాల్ గా వినరో భాగ్యము విష్ణు కథ తరువాత మాస్ ఇమేజ్ కోసం కిరణ్ అబ్బవరం మీటర్ తో చేసిన ప్రయత్నం ఫలించిందనే చెప్పాలి. పోలీస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈచిత్రంలో కిరణ్ నటన ,ఇంటర్వెల్ ట్విస్టు హైలైట్ అయ్యాయి. మాస్ ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: