సీఎం రేవంత్ రెడ్డికి నాని విజ్ఞప్తి: అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు అనుమతి కోరిన హీరో

Nani Requests CM Revanth Reddy to Allow Him to Watch the Movie with Fans

నాని కథానాయకుడిగా నటించిన భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’ ( సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 23 సాయంత్రం హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ థియేటర్లలో ఒకదానిలో ప్రేక్షకులతో కలిసి ప్రీమియర్ షో చూడాలని ఉందంటూ హీరో నాని సోషల్ మీడియా వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరియు పోలీస్ శాఖను కోరారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నాని విజ్ఞప్తిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రిప్లై ఇచ్చారు. తెలంగాణకు చెందిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ చిత్రం పట్ల నాని కనబరుస్తున్న నిబద్ధతను, అలాగే భద్రతా మార్గదర్శకాలను గౌరవిస్తూ చేసిన అభ్యర్థనను సీఎం అభినందించారు.

శాంతిభద్రతలు, క్రౌడ్ మేనేజ్‌మెంట్ మరియు ప్రజారోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత స్థానిక పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని సీఎం సూచించారు. అందిన దరఖాస్తును సంబంధిత పోలీస్ బృందం పరిశీలించి, భద్రతా ప్రమాణాల ప్రకారం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.