కిరణ్ అబ్బవరం మీటర్ టీజర్ రిలీజ్

Kiran Abbavaram Meter Movie Teaser Out Now,Meter Teaser,Kiran Abbavaram,Ramesh Kaduri,Athulyaa Ravi,Sai Kartheek,Mythri Movie Makers,2023 Telugu Teasers,Latest Telugu Movie Teasers 2023,Telugu Filmnagar,Telugu Teasers 2023,Meter,Meter Movie,Meter Telugu Movie,Meter Teaser,Meter Movie Teaser,Meter Telugu Movie Teaser,Meter Telugu Teaser,Meter Official Teaser,Kiran Abbavaram New Movie Teaser,Kiran Abbavaram Latest Movie Teaser,Kiran Abbavaram Movies,Meter Movie Updates,Kiran Abbavaram Meter Movie Teaser

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. వైవిధ్యమైన కథలు, విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ హీరోగా తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్‌చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గానే వినరో భాగ్యము విష్ణుకథ చిత్రంతో విజయాన్ని అందుకొని నిర్మాతలకు లాభాలు అందించాడు. ఇక ఇప్పుడు వెంటనే మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. రమేశ్ కాడూరి దర్శకత్వంలో కిరణ్ హీరోగా వస్తున్న సినిమా మీటర్. ఈ సినిమాలో కిరణ్ తొలిసారి ఓ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుండగా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక మాస్ ఎలిమెంట్స్ తో టీజర్ అయితే ఆకట్టుకుంటుంది. కొత్త బాడీ లాంగ్వేజ్ తో కిరణ్ అబ్బవరం కనిపిస్తున్నాడు. సాయి కార్తీక్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. మొత్తానికి టీజర్ తో అయితే ఈసినిమాపై అంచనాలు పెంచేశాడు కిరణ్. చూద్దాం మరి ఈసినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో..

కాగా ఈసినిమాలో అతుల్య రవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో అతుల్య రవి కథానాయికగా తెలుగు తెరకి పరిచయమవుతోంది. 2017లోనే కోలీవుడ్ కి పరిచయమైన అతుల్య ఈ సినిమాతో ఇక్కడ ఎన్ని మార్కులు కొట్టేస్తుందనేది చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. సాయికార్తీక్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈసినిమాతో కిరణ్ అబ్బవరం ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + two =