72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ వేడుక ఘనంగా జరుగుతున్న వేళ, తెలుగు సినిమా పరిశ్రమ జాతీయ స్థాయిలో తన సత్తా చాటింది. ఈ ఏడాది తెలుగు చిత్రాలు మొత్తం తొమ్మిది అవార్డులను కైవసం చేసుకుని, భారతీయ చలనచిత్ర పరిశ్రమలో టాలీవుడ్ స్థాయిని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పాయి. ముఖ్యంగా కమర్షియల్ హంగులతో పాటు విభిన్న కథాంశాలను ఎంచుకున్న తెలుగు సినిమాలు జాతీయ జ్యూరీ ప్రశంసలు పొందాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కల్కి 2898 ఏడీ : డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘సంపూర్ణ వినోదాన్ని అందించిన ఉత్తమ ఫీచర్ ఫిల్మ్’ పురస్కారాన్ని గెలుచుకుంది. మహాభారత నేపథ్యాన్ని భవిష్యత్ కాలపు డిస్టోపియన్ ప్రపంచంతో ముడిపెడుతూ రూపొందించిన తీరుకు ఈ గుర్తింపు దక్కింది. అలాగే, ఈ చిత్రంలోని విభిన్న ప్రపంచాలను అద్భుతంగా సృష్టించినందుకు గాను ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జిహాని చౌదరికి ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ అవార్డు లభించింది.
పుష్ప 2: ది రూల్ : బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ఈ చిత్రానికి గాను దర్శకుడు సుకుమార్‌కు ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో జాతీయ అవార్డు దక్కింది. ముఖ్యంగా గంగమ్మ జాతర సీక్వెన్స్‌లో సాంస్కృతిక ప్రాధాన్యతను చాటుతూ డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్‌కు గుర్తింపుగా, కాస్ట్యూమ్ డిజైనర్లు దీపాలీ నూర్ మరియు శీతల్ శర్మలు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ అవార్డును పంచుకున్నారు.
కమిటీ కుర్రోళ్లు : నూతన దర్శకుడు యధు వంశీ తెరకెక్కించి, నిహారిక కొనిడెల నిర్మించిన ఈ చిత్రం ‘ఉత్తమ తెలుగు ఫీచర్ ఫిల్మ్’ అవార్డును సొంతం చేసుకుంది. స్నేహం, వర్గ విబేధాల నేపథ్యంలో సాగే ఈ రియాల్టిక్ డ్రామాకి గాను, మేకప్ విభాగంలో పి. రవికుమార్‌కు ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ అవార్డు లభించింది.
35 – చిన్న కథ కాదు: నందకిషోర్ ఈమాని దర్శకత్వంలో వచ్చిన ఈ హృద్యమైన చిత్రం ‘ఉత్తమ బాలల చిత్రం’ గా నిలిచింది. ఈ చిత్రంలో అద్భుత నటన కనబరచిన బాలనటుడు అరుణ్‌దేవ్ ఉత్తమ బాల నటుడు పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు.
లక్కీ భాస్కర్ : వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి గాను, దర్శకుడు వెంకీ అట్లూరి ఉత్తమ డైలాగ్ రైటర్ గా జాతీయ అవార్డును అందుకున్నారు.
ఈ విధంగా పాన్-ఇండియా స్థాయి సినిమాలతో పాటు కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలతోనూ టాలీవుడ్ మేకర్స్ మరియు నటీనటులు జాతీయ స్థాయిలో సత్తా చాటడం తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























