బాక్సాఫీస్ వద్ద జడల్ జాతర .. నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Nani’s The Paradise Scores the Biggest Opening of His Career

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో వస్తున్న భారీ రా అండ్ మాస్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’ థియేటర్లలోకి రాకముందే బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతున్న ఈ చిత్రం, కేవలం అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే రూ. 50 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమాతో అమెరికా మార్కెట్‌లో నాని క్రేజ్ మరోసారి నిరూపితమైంది. ప్రీమియర్లతో పాటు ముందస్తు టికెట్ విక్రయాల ద్వారానే అక్కడ ఏకంగా 1 మిలియన్ డాలర్ మైలురాయిని సునాయాసంగా దాటేసి, యుఎస్‌ఏలో వేగంగా ఈ మార్క్ చేరుకున్న తెలుగు చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

తెలుగు రాష్ట్రాల్లోనూ నైజాం, సీడెడ్ సహా అన్ని ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ తుఫాన్ వేగంతో సాగుతున్నాయి. ‘జడల్’ పాత్రపై ఉన్న అంచనాలు, అనిరుధ్ సంగీతం మరియు శ్రీకాంత్ ఓదెల టేకింగ్‌పై ప్రేక్షకుల్లో ఉన్న నమ్మకం ఈ స్థాయి రికార్డు నమోదుకు కారణమయ్యాయి.ఇక ఈరేంజ్ అడ్వాన్స్ బుకింగ్ తో బాక్సాఫీస్ వద్ద నాని కెరీర్‌లోనే ది ప్యారడైజ్ ఆల్‌టైమ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రికార్డు సాధించింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.