అడ్వాన్స్ బుకింగ్‌లో ది ప్యారడైజ్ ర్యాంపేజ్

The Paradise Rampage in Advance Bookings

నాని కథానాయకుడిగా, శ్రీకాంత్ ఒడెల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ విడుదల ముంగిట బుకింగ్స్ మోతెక్కిస్తోంది. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానున్న ఈ చిత్రానికి ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లలో అసాధారణ స్పందన లభిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘బుక్‌మైషో’ ప్లాట్‌ఫామ్‌లో గంటకు 14 వేలకు పైగా టికెట్లు అమ్ముడవుతుండటం ఈ సినిమాపై ఉన్న డిమాండ్‌ను స్పష్టం చేస్తోంది. నైజాం హక్కులను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ₹37 కోట్లకు సొంతం చేసుకోగా, అడ్వాన్స్ సేల్స్ ఊపు చూస్తుంటే మొదటి రోజే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఖాయంగా కనిపిస్తున్నాయి. ఇక అటు ఓవర్సీస్ లో కేవలం అడ్వాన్స్ సేల్స్ ద్వారానే 1 మిలియన్ డాలర్ మార్క్ చేరువలో వుంది.

174 నిమిషాల నిడివితో (A-సర్టిఫికేట్) వస్తున్న ఈ చిత్రం, అనిరుధ్ రవిచందర్ అందించిన సాంగ్స్ , బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరియు రా-యాక్షన్ ఎలిమెంట్స్‌తో హైప్‌ను గరిష్ఠ స్థాయికి తీసుకెళ్ళింది. ఈనెల 24న ఈసినిమా విడుదలకానుండగా తెలుగు రాష్ట్రాల్లో రేపు సాయంత్రం 6 గంటలనుండి స్పెషల్ షోస్ పడనున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.