ఏప్రిల్ లో విడుదలవుతున్న సినిమాలు ఇవే.. మీ ఓటు దేనికి ? 

For Which April Telugu Movie Release You Are Eagerly Waiting

ఈ ఏప్రిల్ లో హై బడ్జెట్ తో పాటు మీడియం బడ్జెట్ సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం…

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వాల్తేరు వీరయ్య ,ధమాకాతో బ్లాక్ బాస్టర్ హిట్లు కొట్టిన మాస్ మహారాజా రవితేజ మరో సారి బాక్సాఫీస్ మీద దండెత్తనున్నాడు. రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ రావణాసుర. ఈనెల 7న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో ఏకంగా 5గురు హీరోయిన్లు నటించారు.

ఇక ఈసినిమాతో పాటు అదే రోజున యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మీటర్ అనే సినిమాతో వస్తున్నాడు. ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడంతో ఈసినిమాకు మంచి బజ్ క్రియేట్ అయ్యింది. రమేష్ కడూరి  తెరకెక్కించిన ఈచిత్రంలో అతుల్యా హీరోయిన్. మైత్రి మూవీ మేకర్స్ ,క్లాప్ ఎంటర్టైనర్ సంయుక్తంగా నిర్మించగా సాయి కార్తీక్ సంగీతం అందించాడు.

ఈ రెండు సినిమాల తరువాత వచ్చే వారంలో భారీ బడ్జెట్ చిత్రం శాకుంతలం విడుదలకానుంది. సమంత టైటిల్ రోల్ లో నటించిన ఈ సినిమా కూడా భారీ హైప్ తో రానుంది. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఈచిత్రానికి మణిశర్మ సంగీతం అందించాడు. ఏప్రిల్ 14న పాన్ ఇండియా మూవీ గా ప్రేక్షకులముందుకు రానుంది. ఈసినిమా 3డిలో కూడా విడుదలకానుంది.

ఇక ఆ తరువాత వారంలో సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష విడుదలకానుంది. డిఫ్రెంట్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈసినిమాకు కూడా మంచి హైప్ వుంది. ట్రైలర్ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తుండగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈనెల 21న ఈసినిమా తెలుగు తోపాటు హిందీ,తమిళ్ ,కన్నడ ,మలయాళ భాషల్లో విడుదలకానుంది.

ఆ తరువాత వారంలో మరో రెండు సినిమాలు విడుదలకానున్నాయి. అందులో అక్కినేని అఖిల్ నటిస్తున్న ఏజెంట్ ఒకటి. సురేందర్ రెడ్డి డైరెక్టర్ కావడం అలాగే టీజర్ లోని యాక్షన్ సీన్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ఏజెంట్ పై భారీ అంచనాలు వున్నాయి. సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుండగా అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈనెల 28న విడుదలకానుంది.

ఇక అదే రోజు మణిరత్నం బిగ్ బడ్జెట్ మూవీ పొన్నియిన్ సెల్వన్2 విడుదలవుతుంది. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో బాగంపై అంచనాలు పెరిగాయి. విక్రమ్ , కార్తీ , జయం రవి ,ఐశ్వర్య రాయ్ ,త్రిష కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ గా విడుదలకానుంది.

మరి ఈసినిమాల్లో మీరు ఏ సినిమాలను చూడాలనుకుంటుంన్నారో మీ ఓటు ద్వారా తెలియజేయండి 👇

[totalpoll id=”97719″]

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.