ఉగ్రం కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

allari naresh ugram movie new release date fixed

విజయ్ కనకమేడల దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా వస్తున్న సినిమా ఉగ్రం. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో నాంది వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా మంచి ఆదరణను దక్కించుకుంది. ఇక ఇప్పుడు మరోసారి ఉగ్రంతో వస్తున్నారు. ఈసినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. దానికితోడు ఈసినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలను మరించ పెంచేశాయి. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిజానికి ఈసినిమాను ఏప్రిల్ లో రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు చిత్రయూనిట్. అయితే ఇంకా పనులు పెండింగ్ లో ఉండటంతో ఈసినిమా రిలీజ్ డేట్ వాయిదా పడింది. ఇప్పుడు తాజాగా ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈనేపథ్యంలోనే కొత్త రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. ఈసినిమాను మే 5వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.

ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన మిర్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈసినిమాను షైన్ స్క్రీన్స్‌ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. మాట‌లు అబ్బూరి ర‌వి అందిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా, సిద్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 2 =