మొత్తానికి ఎన్టీఆర్ అభిమానులు ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న సమయం వచ్చేసింది. ఎన్టీఆర్ 30 వ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని వేయి కళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ కోసం నాలుగేళ్లు వెయిట్ చేశారు. ఇక సినిమా రిలీజ్ అయిన ఈ సినిమాను మొదలుపెడతాడు అనుకుంటే ఇప్పటికే ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయి కూడా ఏడాది కావస్తుంది. మరోపక్క చరణ్ ఆర్ఆర్ఆర్ మరో సినిమాను కంప్లీట్ చేసేస్తున్నాడు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు తమ హీరో సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నేడు ఈసినిమా గ్రాండ్ గా లాంచ్ అయింది. ఇక ఈ పూజా కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ తో పాటు రాజమౌళి, ఎన్టీఆర్ 31వ సినిమాకి దర్శకత్వం వహించనున్న ప్రశాంత్ నీల్, ప్రకాష్ రాజ్, దిల్ రాజ్, నిర్మాత నాగవంశీ, శ్రీకాంత్ లు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా రాజమౌళి ఎన్టీఆర్ జాన్వీపై ముహూర్తం షాట్‌కు క్లాప్ కొట్టారు. ప్రశాంత్ నీల్ స్విచ్ఛాన్ చేశారు. ఇక మార్చి 30వ తేదీ నుండి రెగ్యులర్ షూట్ మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: