స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ఘనవిజయం సాధించింది. సంగీత దర్శకుడు కీరవాణి స్వరకల్పనలో చంద్ర బోస్ రచన, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించిన, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీలో హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మ్ చేసిన నాటు నాటు సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మార్చి 12, 2023 న జరిగిన ఆస్కార్ అవార్డు వేడుకలో బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాట, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ గెలుచుకుంది. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తెలుగు సాంగ్ ఆస్కార్ వేడుకలో షేక్ చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఎంఎం కీరవాణి, రైటర్ చంద్రబోస్, కొరియోగ్రఫర్ ప్రేమ్ రక్షిత్, సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ, హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లకి స్పెషల్ కంగ్రాట్స్ అనీ.. ఈ మ్యూజిక్ మూమెంట్ పాజిబుల్ కావడానికి కారణమైన రాజమౌళి పై ప్రశంసలు కురిపిస్తూ హార్ట్ టచింగ్ ముమెంట్ ఫర్ ఇండియన్ సినిమా అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: