సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా రావణాసుర. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే ఈసినిమా నుండి వచ్చిన ప్రతి అప్ డేట్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్, అలానే రావణాసుర సాంగ్ అయితే మరింత ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు ఈసినిమా మరో పాటను రిలీజ్ చేయనున్నారు. వెయ్యినొక్క అనే సాంగ్ ప్రోమో ను నేడు రిలీజ్ చేశారు. ఈ ప్రోమో సాంగ్ ఆకట్టుకుంటుంది. ఫుల్ సాంగ్ ను రేపు సాయంత్రం 4:05 గంటలకు విడుదల కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
When classic meets contemporary 🤩😍
▶️https://t.co/vyiDiRb58t#Veyyinokka song promo from #Ravanasura out now
Full lyrical song releasing tomorrow @ 4:05PM@RaviTeja_offl @akash_megha @sudheerkvarma@rameemusic @AbhishekPicture @itswetha14 @adityamusic pic.twitter.com/6I5n9deImz
— RT Team Works (@RTTeamWorks) March 14, 2023
కాగా ఈసినిమాలో హీరో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అభిషేక్ నామా అభిషేక్ పిక్చర్స్, ఆర్ టి టీమ్‌వర్క్స్ గ్రాండ్ స్కేల్ లో నిర్మిస్తున్నాయి. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి కథ అందించారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫర్ గా, శ్రీకాంత్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. రావణాసుర చిత్రాన్ని 2023 ఏప్రిల్ 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: