మోస్ట్ ఛాలెంజింగ్ ఫిలిం దసరా

Dasara Movie Is The Most Challenging Film In My Career Says Nani,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Dasara,Dasara Movie,Dasara Telugu Movie,Dasara Movie Updates,Dasara Movie Songs,Nani,Nani Movies,Nani New Movie,Nani Latest Movie,Nani Upcoming Movies,Nani Latest News,Nani Latest Interview,Nani New Interview,Nani Dasara,Nani Dasara Movie,Nani About Dasara,Nani About Dasara Movie,Nani Talks About Dasara Movie,Dasara Most Challenging Film In My Career Says Nani,Nani About Dasara Film

రీసెంట్ గానే అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని ప్రస్తుతం మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. దసరా అనే డిఫరెంట్ కథతో ఈసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇంతకుముందు ఎప్పుడు చేయని డీ గ్లామర్ పాత్రలో అవుట్ అండ్ అవుట్ యాక్షన్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వ‌స్తున్నాడు నాని. సింగ‌రేణి బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కుతున్న ఈ మూవీకి డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని దసరా గురించి చెబుతూ.. ఈసినిమా తన కెరీర్ లోనే ఛాలెంజింగ్ సినిమా అని చెబుతున్నాడు. ఈసినిమా బొగ్గుగనుల నేపథ్యంలో వస్తున్న సినిమా కాబట్టి.. సినిమాకు తగ్గట్టు రఫ్ అండ్ రస్టిక్ లుక్ కోసం గంటకు పైగానే మేకప్ కు టైమ్ పట్టేది.. నాలుగు లేయర్ల వరకూ మేకప్ వేసుకునేవాడిని.. ఇంకా దానిని తీయడానికి మరో గంట టైమ్ పట్టేది అంటూ ఆసక్తికర విషయాలు తెలిపాడు. అంతేకాదు నేను ఇంకా చిత్రయూనిట్ రెండు మేజర్ యాక్సిడెంట్స్ నుండి తప్పించుకున్నాం.. ప్రతికూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ షూటింగ్ ను జరిపాం అని తెలిపాడు. మరి దసరా టీమ్ పడిన కష్టానికి ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

కాగా ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా.. ఎడిటర్‌గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా విజయ్‌ చాగంటి వ్యవహరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.