మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్-డ్రామా ‘మారెమ్మ’తో హీరోగా పరిచయం అవుతున్నారు. మంచాల నాగరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా, మోక్ష ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తోంది. మయూర్ రెడ్డి బండారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, పాటలు కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 10 ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు వస్తోంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు దర్శకుడు శివ నిర్వాణ హాజరయ్యారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ట్రైలర్ ని డిజిటల్ గా లాంచ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో మాధవ్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. ముందుగా దర్శకుడు శివ నిర్వాణ గారికి ధన్యవాదాలు. అలాగే మా ట్రైలర్‌ను డిజిటల్‌గా లాంచ్ చేసిన రామ్ పోతినేని గారికి థాంక్యూ సో మచ్. ఈ ట్రైలర్ మీ అందరికీ నచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాతో పరిచయం కావడం చాలా ఆనందంగా ఉంది. బేసిగ్గా అన్నదమ్ముల మధ్య ఒక ఎమోషన్ ఉంటుంది. కానీ ఇందులో ఒక దున్నపోతుకు మరొక మనిషికి ఉండే అనుబంధం ఎలా ఉంటుందో సెప్టెంబర్ 10న మీకు కనిపించబోతుంది. ఈ కథని నా దగ్గరికి తీసుకొచ్చిన మా నిర్మాతలకు థాంక్యూ. మా ఎడిటర్ కి, మ్యూజిక్ డైరెక్టర్‌కి, డీఓపీకి, ఆర్ట్‌కి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. రవితేజ గారి ఫ్యాన్స్ అందరికీ థాంక్యూ. రవితేజ గారు ఈ సినిమా చూశారు. ఆయనకి క్లైమాక్స్ చాలా అద్భుతంగా నచ్చింది. చాలా ఎమోషనల్ అయ్యారు. ‘ఇరుముడి’ సక్సెస్‌తో అందరూ మంచి జోష్‌లో ఉన్నారు. దీన్ని ఇలాగే కంటిన్యూ చేయడానికి మ్యాక్సిమమ్ ట్రై చేస్తాను. సెప్టెంబర్ 10న మీరందరూ సపోర్ట్ చేస్తే కచ్చితంగా కొట్టేద్దాం.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























