అల్లరి నరేష్ ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’ తో అలరించబోతున్నారు. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ముందుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను చిన్నప్పటి నుంచి నాగార్జున గారి అభిమానిని. ఆయనతో కలిసి ‘నా సామి రంగా’ సినిమాలో నటించాను. ఇప్పుడు ఆయన ప్రొడక్షన్‌లో హీరోగా చేస్తున్నాను. నిమ్మకాయల ప్రసాద్ గారితో పరిచయం నాకు ‘అల్లరి’ సినిమా నుంచి మొదలైంది. ఆ సినిమాకి ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అప్పటినుంచి నాకు బాగా తెలుసు. ఆయన జడ్జిమెంట్ చాలా బాగుంటుంది. ఈ కథ ఆయనకి చాలా నచ్చింది.
అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్‌లో సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. చంద్రమోహన్ గారు దర్శకుడు కావడానికి చాలా కష్టపడ్డారు. పరిశ్రమలో అవకాశాలు రాకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. మా నాన్నగారు కూడా ‘చెవిలో పువ్వు’ సినిమా తర్వాత వన్ ఇయర్ ఖాళీగా ఉన్నప్పుడు ఆ బాధ ఎలా ఉండేదో నేను చూశాను. దర్శకుడు చంద్రమోహన్‌కి ఇక్కడి నుంచి సక్సెస్ మొదలవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా నాకంటే చంద్రమోహన్ కోసం చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి. అందరూ చాలా ఫ్రెండ్లీగా ఈ సినిమా చేశారు. ఈ సినిమాలో పెద్ద నరేష్ గారు ఉన్నారు. కచ్చితంగా నవ్వులు రెండింతలు ఉంటాయి. మా రంభ, ఊర్వశి, మేనక చాలా కష్టపడ్డారు. చాలా ఎనర్జీతో ఈ సినిమా చేశారు. సురభి కూడా చాలా చక్కగా పర్ఫార్మ్ చేసింది. తను మరిన్ని తెలుగు సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇది అందరినీ నవ్వించే ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ సినిమా రిలీజ్ సెప్టెంబర్ 4. సక్సెస్ మీట్ సెప్టెంబర్ 9. సినిమాతో హిట్టు కొడుతున్నాం. సక్సెస్ మీట్ పెడుతున్నాను.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























