అనస్వర రాజన్ బర్త్‌డే స్పెషల్.. కాకా నుండి ఫస్ట్ లుక్ లుక్ రివీల్

Anaswara Rajan First Look from Kaaka Revealed

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా దర్శకుడు బాబీ (కేఎస్ రవీంద్ర) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ మూవీ ‘కాకా’ నుంచి అదిరిపోయే బర్త్‌డే అప్‌డేట్ వచ్చేసింది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో నటిస్తున్న అనస్వర రాజన్ పుట్టినరోజు సందర్భంగా శ్రేయోభిలాషులు, చిత్ర బృందం ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా ఈ చిత్రం నుంచి ‘అమ్ములు పాప’ (అనస్వర రాజన్) ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. “ది హార్ట్ ఆఫ్ కాకా” అంటూ వర్ణిస్తూ, ఈ కథలో ఆమె పాత్ర ఎంతో ప్రత్యేకమైనదిగా నిలవబోతోందని టీమ్ పేర్కొంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగవంతంగా జరుపుకుంటోంది. నివేదా థామస్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కణ్ణన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.

సంక్రాంతి కానుకగా 2027 జనవరి 13న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ పునరుద్ఘాటించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.