పలు యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న హీరో రామ్ ఇప్పుడు మరో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీతో ప్రేక్షకులను అలరించనున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని, పెళ్ళి సందD మూవీ ఫేమ్ శ్రీలీల జంటగా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ #RAPO20 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానున్న #RAPO20 మూవీకి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.300 మంది ఫైటర్స్ తో రామ్ యాక్షన్ సీన్ ఈ మూవీకి హైలైట్ గా నిలవనుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#RAPO 20 మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కొత్త షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో హీరో రామ్ , హీరోయిన్ శ్రీ లీల తో పటు ప్రధాన తారాగణం తో కుటుంబ సన్నివేశాలను తెరకెక్కించడానికి దర్శకుడు బోయపాటి ప్లాన్ చేశారు . ఈ మూవీ లో హీరో రామ్ ను ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ తో దర్శకుడు బోయపాటి ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. బ్లాక్ బస్టర్ అఖండ మూవీ తరువాత దర్శకుడు బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: