మోహన్ బాబు వారసత్వంతో తెలుగు తెరకు పరిచయమైన నటి మంచు లక్ష్మీ. ముందు బుల్లి తెరపై హోస్ట్ గా మారిన లక్ష్మీ ఆ తరువాత పలు సినిమాల్లో పలు కీలక పాత్రల్లో నటించి తన టాలెంట్ ను చూపించింది. రెగ్యులర్ గా సినిమాలు చేయకపోయినా అప్పుడప్పుడు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తూనే ఉంది. చాలా గ్యాప్ తరువాత మంచు లక్ష్మీ ఇప్పుడు ఒక సినిమాలో నటిస్తుంది. వంశీ కృష్ణ మళ్ల దర్శకత్వంలో మంచు లక్ష్మీ, మోహన్ బాబు ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా అగ్నినక్షత్రం.
ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా నేడు ఈసినిమా నుండి లక్ష్మీ మంచు పాత్ర కు సంబంధించి గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. టాలీవుడ్ టాలెంటెడ్ హీరో రానా ఈ గ్లింప్స్ ను రిలీజ్ చేశాడు. గ్లింప్స్ ను బట్టి ఈ మూవీలో ఆమె పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుంది. ఎవరో ఒకవ్యక్తి కొంత మంది వ్యక్తులను చంపేస్తుంటాడు. అతన్ని పట్టుకోవటానికి లక్ష్మీ మంచు స్పెషల్ ఆఫీసర్‌గా వస్తుందని గ్లింప్స్ ను అర్థమవుతుంది. గ్లింప్స్ చివరిలో మోహన్ బాబు ను చూపించారు. మరి మోహన్ బాబు ఏ పాత్రలో నటిస్తున్నాడో చూడాలి.
Unleashing the power of #AgniNakshatram
Need all your blessings !!!
Love All ❤️ Happy Valentines Day https://t.co/GdeCHruSaW pic.twitter.com/9owKzojElk
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) February 14, 2023
కాగా ఈసినిమాలో మళయాళం స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సిద్దిక్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా హీరో విశ్వంత్, చైత్ర శుక్ల తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్స్‌మెంట్స్ బ్యానర్లపై మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతం.. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























