సూపర్ హిట్ లీడర్ మూవీతో కథానాయకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయినా రానా దగ్గుబాటి తెలుగు ,, తమిళ హిందీ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రానా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. నటుడు, నిర్మాత, టీవీ హోస్ట్, బిజినెస్ మ్యాన్ రానా ప్రస్తుతం తెలుగు, హిందీ భాషలలో రూపొందుతున్న రానా నాయుడు వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. హైదరాబాద్ బేస్డ్ ఇంటీరియర్ డిజైనర్ మిహికా బజాజ్ ను ప్రేమించి, పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈరోజు అంతర్జాతీయ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తన భర్త, రానాను ఉద్దేశించి ఆయన భార్య మిహీకా బజాజ్ సోషల్ మీడియాలో భావోద్వేగంతో కూడిన పోస్ట్ చేశారు. తన కలల మనిషికి ప్రేమికుల రోజు శుభాకాంక్షలు అనీ.. స్ట్రాంగ్, స్వీట్, అందం, అద్భుతం ఇలా తన గురించి చెప్పుకుంటూ పోవడానికి పదాలు చాలడం లేదనీ.. నీవు నన్ను ఎంతో ప్రేమించడంలో ఆశ్చర్యం లేదనీ.. సరదాగా అంటున్నా. నీ పనుల నిమిత్తం నీవు చాలా రోజులు దూరంగా ఉంటూ నన్ను బాధ పెట్టొచ్చు. కానీ నీ ఆ నవ్వు నన్ను మళ్లీ నీతో ప్రేమలో పడేలా చేస్తుందనీ.. హ్యాపీ వాలెంటైన్స్ డే అంటూ మిహికా ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: