తెలుగు, తమిళ్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. రీసెంట్ గా సూపర్ హిట్ యశోద మూవీలో సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సమంత కథానాయికగా తెరకెక్కిన మైథలాజికల్ మూవీ శాకుంతలం 3D ఫార్మాట్ లో పాన్ ఇండియా మూవీగా విడుదలకు సిద్ధంగా ఉంది. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఖుషి మూవీలో సమంత నటిస్తున్నారు. సిటాడెల్ హిందీ వెబ్ సిరీస్ లో సమంత నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మయో సైటిస్ అనే వ్యాధి నుండి కోలుకున్న సమంత ఫిట్ గా మారారు. తీరిక దొరకడంతో సమంత 600 మెట్లు ఎక్కి తమిళనాడులోని పళని మురుగన్ స్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. 600 మెట్లు ఎక్కడం మాత్రమే కాదు.. మెట్టు మెట్టుకూ కర్పూరం వెలిగించి తన భక్తిని చాటుకున్నారు. సమంత టీంతో పాటు.. జాను (తమిళంలో 96) చిత్ర దర్శకుడు సి ప్రేమ్ కుమార్ కూడా సమంత దర్శన ఏర్పాట్లు దగ్గరుండి చూసుకున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: