విట్టి దండు (2014 ) మరాఠీ మూవీతో కెరీర్ ప్రారంభించిన మృణాల్ ఠాకూర్ లవ్ సోనియా మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ మూవీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన మృణాల్ సీతారామం మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ మూవీలో సీత పాత్రలో తన అందం, అభినయంతో మృణాల్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సీతారామం మూవీ సక్సెస్ తో మృణాల్ పలు అవకాశాలు అందుకుంటున్నారు. ప్రస్తుతం 4 బాలీవుడ్ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్న మృణాల్, వైరా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శౌర్యువ్ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కనున్న# NANI 30 మూవీలో కథానాయికగా ఎంపిక అయ్యారు. మృణాల్ ఇప్పుడు కోలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టూడియో గ్రీన్, యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై శివ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా సూర్య 42 తమిళ మూవీ భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటానీ కథానాయిక. సూర్య హీరోగా నటిస్తోన్న తొలి పీరియాడిక్ మూవీ సూర్య 42 లో 13 పాత్రల్లో కనిపించబోతున్నారని సమాచారం. ఈ మూవీలో మరో హీరోయిన్ కు అవకాశం ఉండటంతో మృణాల్ ఠాకూర్ ఎంపిక అయినట్టు సమాచారం. ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























